పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించడానికి అసలు కారణాలివే?

పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాల విజయాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి.ఈ సినిమాలలోని కథ, కథనాల కంటే పాత్రలే సినిమాల సక్సెస్ కు ఒక విధంగా కారణమయ్యాయని చెప్పవచ్చు.

 Reasons Behind Pushpa Akhanda Bangarraju Movies Success , Akahnda, Bangarraju Mo-TeluguStop.com

పాత్రల యొక్క మేనరిజమ్స్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఈ సినిమాలకు సీక్వెల్స్ రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారంటే ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో సులభంగానే అర్థమవుతుంది.

అఖండ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించగా అఘోరా పాత్ర హైలెట్ గా నిలిచింది.సినిమాలో ఈ పాత్ర నిడివి తక్కువే అయినా ఈ పాత్ర వల్లే అఖండ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

అఖండ పాత్రకు ఉండే ప్రత్యేకతలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పుష్పరాజ్ పాత్రకు ప్రశంసలు దక్కాయి.

పుష్పరాజ్ పాత్రలో బన్నీ తప్పా మరో హీరో నటించలేరనేంత అద్బుతంగా నటించారు.తన సినిమాలలోని పాత్రలు ప్రత్యేకంగా ఉండేలా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుందని సమాచారం.సంక్రాంతికి రిలీజైన బంగార్రాజు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే విషయం తెలిసిందే.

బంగార్రాజు పాత్ర వల్లే ఈ సినిమా అంచనాలకు అందని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.బంగార్రాజు పాత్రలో హీరో నాగార్జున జీవించారని చెప్పాలి.పాత్రను ఉద్దేశిస్తూ టైటిల్స్ పెట్టిన సినిమాలు ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ సాధిస్తున్నాయి.టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు వరుసగా సక్సెస్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

Reasons Behind Pushpa Akhanda Bangarraju Movies Success , Akahnda, Bangarraju Movie, Pushpa, Reasons Behind Success - Telugu Akhanda, Bangarraju, Pushpa

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube