ఆదిపురుష్ లో ప్రభాస్ ను అందుకే ఎంపిక చేశారా.. బాలీవుడ్ స్టార్స్ ను కాదని?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముని పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలను కాదని ఈ సినిమాలో ప్రభాస్ ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది.

 Reasons Behind Prabhas Selected For Aadipurush Movie Details Here ,aadipurush, P-TeluguStop.com

కొన్ని స్పెషల్ రీజన్స్ వల్లే ఈ సినిమాలో ప్రభాస్ ను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.దసరా పండుగ కానుకగా ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉంది.ప్రభాస్ కు పని పట్ల అంకిత భావం ఉండటంతో పాటు ఒక సినిమా కోసం ఎంత కష్టపడాలో ప్రభాస్ అంత కష్టపడతారనే సంగతి తెలిసిందే.

సినిమాకు సంబంధించిన పనులలో వేలు పెట్టడానికి స్టార్ హీరో ప్రభాస్ అస్సలు ఇష్టపడరు.సినిమా షూటింగ్ ఆలస్యమైనా ప్రభాస్ దర్శకులను ఇబ్బంది పెట్టరు.

సినిమా క్వాలిటీ విషయంలో ప్రభాస్ అస్సలు రాజీ పడరనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా కూడా సినిమాలకు ఎలాంటి డ్యామేజ్ జరగదనే సంగతి తెలిసిందే.

పారితోషికం ఆలస్యంగా ఇచ్చినా ప్రభాస్ నిర్మాతలను అస్సలు ఇబ్బంది పెట్టరు.సెట్ లో చిన్న నటుని నుంచి పెద్ద నటుల వరకు అందరినీ గౌరవిస్తారు.షూటింగ్ లో అందరు నటులకు ప్రభాస్ సొంతంగా ఫుడ్ తెప్పిస్తారనే విషయం తెలిసిందే.

Telugu Aadipurush, Bollywood, Kriti Sanon, Om Rout, Prabhas-Movie

ప్రభాస్ లో అన్నీ పాజిటివ్ లక్షణాలే తప్ప నెగిటివ్ లక్షణాలేవీ లేకపోవడంతో పాటు రాముడి పాత్రకు ప్రభాస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని భావించి ఓం రౌత్ ప్రభాస్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.ప్రభాస్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.సినిమాసినిమాకు ప్రభాస్ పారితోషికంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube