బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సులువే అయినా సినిమాల్లో సక్సెస్ సాధించడం సులువు కాదు.ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ మూవీ బడ్జెట్ కేవలం 5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా ప్రభాస్ మాత్రం మాస్ హీరో అవుతాడనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించింది.రెండో సినిమా రాఘవేంద్ర క్లాస్ మూవీగా తెరకెక్కగా ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
అయితే ప్రభాస్ మాత్రం వర్షంతో తొలి భారీ హిట్ ను సొంతం చేసుకుని ఛత్రపతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి విజయాలతో మార్కెట్ ను పెంచుకున్న ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రపంచ దేశాల్లోని ప్రేక్షకులకు చేరువయ్యారు.
సాహో, రాధేశ్యామ్ సినిమాలకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలు కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలుగా ఉంది.ఈ స్థాయిలో ప్రభాస్ మార్కెట్ పెరగడానికి ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు.ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు రాజా డీలక్స్ అనే సినిమాలలో నటిస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రభాస్ కోరుకుంటున్నారు.ప్రభాస్ సినిమాలన్నీ రికార్డులు క్రియేట్ చేసి పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ పేరు మరింత ఎక్కువగా మారుమ్రోగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ హాలీవుడ్ సినిమాలలో కూడా నటించాలని అభిమానులు భావిస్తున్నారు.
ప్రభాస్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటించి విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రభాస్ ఈ స్థాయికి రావడం కోసం ఎన్నో విద్యలు నేర్చుకోవడంతో పాటు బరువు పెరగడం తగ్గడం చేశారు.
కొన్నిసార్లు గాయాలైనా మరి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆ కష్టాలను అధిగమించి ప్రభాస్ ఈ రేంజ్ కు చేరుకున్నారు.