సాధారణంగా ఒకటి లేదా రెండు సినిమాలు ఫ్లాపైతే ఆ హీరో కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతుందనే సంగతి తెలిసిందే.అయితే ప్రభాస్ ( Prabhas ) కెరీర్ మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా సాగుతోంది.
సినిమాలు ఫ్లాపైనా హిట్టైనా ప్రభాస్ మార్కెట్ మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.ప్రభాస్ స్థాయిలో మరే సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేయడం లేదనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.పెద్దగా అనుభవం లేని డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం వల్లే ప్రభాస్ సినిమాలు( Prabhas Movies ) ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని చాలామంది భావిస్తారు.
ఆదిపురుష్ ( Adipurush ) సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది.
అయితే సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై మాత్రం భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ రెండు సినిమాలు పాన్ వరల్డ్ సినిమాలుగా రిలీజ్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం అన్ని జానర్ల ప్రాజెక్ట్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ప్రభాస్ కు ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉండటంతో ఆయన మార్కెట్ తగ్గడం లేదు.
ప్రభాస్ గత సినిమాల విషయంలో పొరపాట్లు చేసినా ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ సాధించే సత్తా ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండటంతో ఆయన మార్కెట్ పై ఏ మాత్రం ప్రభావం పడటం లేదు.ప్రభాస్ ను ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం అభిమానిస్తారు.ఈ రీజన్స్ వల్లే ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రభాస్ మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.