గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.భూమిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఎం.
ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని యాక్షన్ సినిమాలలో ఒక్కడు మూవీ కూడా ఒకటని చెప్పవచ్చు.మహేష్ బాబుకు మాస్ హీరోగా ఇమేజ్ రావడానికి ఈ సినిమానే కారణమే సంగతి తెలిసిందే.
అయితే గుణశేఖర్ కథ చెప్పిన వెంటనే మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.సీనియర్ రచయిత తోట ప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.మణిశర్మ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కాగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.13 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 32 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.
ఒక్కడు సినిమాకు ముందు మహేష్ బాబు నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.కథ నచ్చిందని చెప్పిన మహేష్ ఆ సినిమాలో నటిస్తారో లేదో చెప్పకపోవడంతో గుణశేఖర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు.
గుణశేఖర్ మహేష్ బాబు మేనేజర్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా అతని మేనేజర్ నుంచి సరైన సమాధానం రాలేదు.ఆ తర్వాత గుణశేఖర్ పవన్ కళ్యాణ్ లేదా వెంకటేష్ తో ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.

అయితే అదే సమయంలో మహేష్ బాబు ఒక్కడు కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది.మొదట గుణశేఖర్ గోపీచంద్ తో విలన్ పాత్రను చేయించాలని అనుకున్నా అప్పటికే మహేష్ గోపీచంద్ కాంబినేషన్ లో నిజం తెరకెక్కుతుండటంతో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు.