పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ చేయకపోవడానికి అసలు కారణమిదే!  

reasons behind pawan kalyan does not appear in six pack look Pawan Kalyan, Six Pack, Ayyapanum Koshiyum, Sagar Chandra, Vakeel Sahebh, Prabhas, Rana, Nithin, Druva, Ramcharan - Telugu Ayyapanum Koshiyum, Nithin, Pawan Kalyan, Pawankalyan, Prabhas, Ramcharan, Reasons Behind Pawan Kalyan Does Not Appear In Six Pack Look, Sagar Chandra, Six Pack, Vakeel Sahebh

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోలు మొదలుకొని స్టార్ హీరోల వరకు ఒకరిద్దరు హీరోలు మినహా మిగతా హీరోలంతా సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చారు.ప్రస్తుతం సినిమాల్లో సిక్స్ ప్యాక్ కు ప్రాధాన్యత తగ్గిపోయినా ఐదారేళ్ల క్రితం సిక్స్ ప్యాక్ లుక్ కోసం హీరోలు పడిన కష్టం అంతాఇంతా కాదు.

TeluguStop.com - Reasons Behind Pawan Kalyan Does Not Appear In Six Pack Look

సిక్స్ ప్యాక్ సినిమాల ఫలితంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా అభిమానులు సినిమాలను మళ్లీ చూడటం కోసం హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశారు.

దేశముదురు సినిమాలో అల్లు అర్జున్, రెచ్చిపో సినిమాలో నితిన్, బాహుబలిలో ప్రభాస్, బాహుబలిలో రానా, టెంపర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో ఎన్టీఆర్, ధృవ సినిమాలో రామ్ చరణ్, డమరుకం సినిమాలో నాగార్జున సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించలేదు.

TeluguStop.com - పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ చేయకపోవడానికి అసలు కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పవన్ అభిమానులు ఆయనను సిక్స్ ప్యాక్ లుక్ లో చూడాలని కోరుకుంటున్నప్పటికీ పవన్ మాత్రం ఎప్పుడూ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేయలేదు.

ఒక ఇంటర్వ్యూలో పవన్ కు సిక్స్ ప్యాక్ గురించి ప్రశ్న ఎదురుకాగా ఆ ప్రశ్నకు స్పందిస్తూ పవన్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు.

తనకు సిక్స్ ప్యాక్ పై పెద్దగా ఆసక్తి లేదని అందువల్లే ఆ దిశగా తాను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని అన్నారు.తనను సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ఎందుకు ట్రై చేయరని చాలా మంది అడుగుతుంటారని తెలిపారు.

అయితే కండలు పెంచడం సులభమేనని.తాను ధైర్యం అనే బలం కోసం పని చేస్తున్నాను కాబట్టి తనకు కండ బలం కంటే గుండె ధైర్యం ముఖ్యమని తెలిపారు.

ప్రజల్లోకి వెళ్లాలంటే గుండె ధైర్యం ఎంతో అవసరమని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాలు కాకుండా మరికొన్ని కమిట్మెంట్లతో పవన్ బిజీగా ఉన్నారు.

పవన్ ప్రస్తుతం నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.

#Ramcharan #Vakeel Sahebh #Six Pack #Pawan Kalyan #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reasons Behind Pawan Kalyan Does Not Appear In Six Pack Look Related Telugu News,Photos/Pics,Images..