తరుణ్ సినిమా వల్ల మహేష్ బాబు నటించిన సినిమా ఫ్లాప్.. ఏం జరిగిందంటే?

హీరో తరుణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో నువ్వేకావాలి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచయితగా పని చేశారు.రామోజీరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.2000 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

 Reasons Behind Mahesh Babu Vamsi Movie Flop Details Here- , Reasons Behind , Mah-TeluguStop.com

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నిరం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను సోలో ప్రొడ్యూసర్ గా నిర్మించాలని స్రవంతి రవికిషోర్ భావించినా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో రామోజీరావుతో కలిసి నిర్మించారు.

కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమా కోసం తరుణ్ తీసుకున్న పారితోషికం కేవలం 3 లక్షల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమాలో సెకండ్ హీరోగా సాయి కిరణ్ నటించగా రిచా హీరోయిన్ గా నటించారు.

ఒక కోటీ 30 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 24 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.మొదట్లో తక్కువ థియేటర్లలోనే నువ్వే కావాలి విడుదల కాగా హిట్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకు రెండో వారం నుంచి థియేటర్లు పెరిగాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి కొన్నిరోజుల ముందు విడుదలైన వంశీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

Telugu Flop, Mahesh Babu, Namratha, Ramojirao, Tharun, Vamsi-Movie

బి గోపాల్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా కృష్ణ కీలక పాత్రలో నమ్రత హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన మహేష్, నమ్రత తర్వాత రోజుల్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.నువ్వేకావాలి విడుదలైన తర్వాత వంశీకి థియేటర్లు తగ్గడంతో పాటు కలెక్షన్లు తగ్గడంతో సినిమా ఫ్లాప్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube