బిగ్ బాస్ షో నుంచి లహరి షారి ఎలిమినేట్ కావడానికి అసలు కారణాలు ఇవే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో నుంచి తొలి వారం సరయు ఎలిమినేట్ కాగా రెండో వారం ఉమాదేవి మూడవ వారం లహరి షారి ఎలిమినేట్ అయ్యారు.వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 Reasons Behind Lahari Shari Elimination From Bigg Boss Show-TeluguStop.com

అయితే నాలుగవ వారం మాత్రం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో నటించి లహరి షారి పాపులారిటీని సంపాదించుకున్నారు.

Telugu Bigg Boss Show, Interesting Facts, Lahari Shari, Reasons For Elimination-Movie

బిగ్ బాస్ హౌస్ లో లహరి ఇతరులు తన గురించి ఏమనుకున్నా అస్సలు పట్టించుకునేవారు కాదు.తనపై ఎవరైనా డైరెక్ట్ గా నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం లహరి షారి ధీటుగా జవాబు ఇచ్చేవారు.ఆవేశం ఎక్కువైన ఈ బ్యూటీ హౌస్ లో కాజల్ తో ఎక్కువగా గొడవ పడేవారు.బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా లహరి షారి ఎంట్రీ ఇవ్వగా మూడో వారమే ఈమె ఎలిమినేట్ కావడం గమనార్హం.

 Reasons Behind Lahari Shari Elimination From Bigg Boss Show-బిగ్ బాస్ షో నుంచి లహరి షారి ఎలిమినేట్ కావడానికి అసలు కారణాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లహరి షారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి.మొదటి వారం గొడవలతో హైలెట్ కావడం, హౌస్ లో ముక్కుసూటిగా వ్యవహరించడం, ప్రతి విషయానికి గొడవ పడటం ఆమెకు మైనస్ అయింది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రియ, ప్రియాంక, సిరి టార్గెట్ చేయడంతో పాటు లహరి సన్నిహితంగా ఉండే మానస్ తో ఆమె గురించి నెగిటివ్ గా చెప్పారు.ముగ్గురు కంటెస్టెంట్లు టార్గెట్ చేయడం లహరికి మైనస్ గా మారింది.

Telugu Bigg Boss Show, Interesting Facts, Lahari Shari, Reasons For Elimination-Movie

ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించకపోవడం, టాస్కులు విన్ కాకపోవడం కూడా ఆమె కెరీర్ కు మైనస్ అయింది.ప్రియ, రవి లహరిని ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ చేశారు.ఇలా చేయడంతో లహరిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత ఏర్పడింది.మరోవైపు లహరి ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

#Bigg Boss Show #Lahari Shari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు