బిగ్ బాస్ కు ఆడవాళ్లంటే చిన్నచూపా.. అందుకే వాళ్లు విన్ కావట్లేదా?

బుల్లితెర రియాలిటీ బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తైనా ఒక్క సీజన్ లో కూడా లేడీ కంటెస్టెంట్ విన్ కాలేదు.గత సీజన్ లో అరియానా విన్నర్ కావచ్చని ప్రచారం జరిగినా బిగ్ బాస్ చివరకు షాక్ ఇచ్చాడనే విషయం తెలిసిందే.

 Reasons Behind Lady Contestants Not Win In Bigg Boss Showreasons Behind Lady Contestants Not Win In Bigg Boss Show-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచారు.బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ కాగా సీజన్2కు కౌశల్ విన్నర్ గా, సీజన్ 3కు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.

ఈ సీజన్ లో కూడా విన్నర్ ఎవరు కావచ్చనే ప్రశ్నకు మేల్ కంటెస్టెంట్ల పేర్లు సమాధానంగా వినిపిస్తూ ఉండటంతో బిగ్ బాస్ లేడీ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.రవి లేదా షణ్ముఖ్ బిగ్ బాస్ షో విన్నర్ కావచ్చని వినిపిస్తోంది.

 Reasons Behind Lady Contestants Not Win In Bigg Boss Showreasons Behind Lady Contestants Not Win In Bigg Boss Show-బిగ్ బాస్ కు ఆడవాళ్లంటే చిన్నచూపా.. అందుకే వాళ్లు విన్ కావట్లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమంది నెటిజన్లు ఇతర భాషల్లో లేడీ కంటెస్టెంట్లు విన్ అవుతున్నా తెలుగులో విన్ కాకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ బాలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని, సోషల్ మీడియాలో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని లేడీ కంటెస్టెంట్లను ఎక్కువగా ఎంపిక చేస్తుండటంతో వాళ్లు విన్ కాలేకపోతున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.మరి కొందరు బిగ్ బాస్ కు ఆడవాళ్లంటే చిన్నచూపు అని అందువల్లే తెలుగులో లేడీ కంటెస్టెంట్లు విన్ కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అయితే కొంతమందికి బిగ్ బాస్ షో ఏ మాత్రం నచ్చకపోయినా మెజారిటీ ప్రజలను ఈ షో ఆకట్టుకుంటోంది.గత సీజన్ ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోలేకపోవడంతో ఈ సీజన్ అయినా ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుంద అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రాబోయే రోజుల్లో రేటింగ్ ను బట్టి బిగ్ బాస్ సీజన్ 5 హిట్టో ఫ్లాపో ఒక అంచనాకు రావచ్చు.

#Abijjith #Bigg Boss #Rahul #Ravi #Biggboss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు