నాగార్జున సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదేనా..?

సీనియర్ స్టార్ హీరో నాగార్జున ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.గతేడాది నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటించగా ఆ సినిమా జనవరి 26వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరిగింది.

 Reasons Behind King Nagarjuna Silence About Wild Dog Movie, Kalyan Krishna, K-TeluguStop.com

అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కాకపోవడం, ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రకటన కూడా వెలువడకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది.

సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ సినిమాల షూటింగ్ పూర్తి కాకపోయినా ఇప్పటికే రిలీజ్ డేట్ లను ప్రకటించారు.

అయితే నాగార్జున మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Kalyan Krishna, Nagarjuna, Praveen Sattaru, Wild Dog-Movie

అయితే నాగార్జున స్పందించి స్పష్టతనిస్తే మాత్రమే వైల్డ్ డాగ్గ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలిసే అవకాశం ఉంది.రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాకు కొత్త దర్శకుడు సోలోమాన్ దర్శకత్వం వహిస్తున్నారు.మరోవైపు నాగార్జున తన సినిమా సోలోగా రిలీజ్ కావాలని భావిస్తున్నారని ఏ సినిమాతో క్లాష్ కాకుండా తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

నాగార్జున స్పందించి వైల్డ్ డాగ్ సినిమా విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు త్వరగా తెర దించుతారో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాలో, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు రాగా ఆ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube