కేసీఆర్ కేటీఆర్ మధ్య విబేధాలకు కారణం ఏంటి ...

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటోంది.ప్రతి రోజు ఏదో ఒక స్టేట్మెంట్ బయటకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

 Reasons Behind Kcr And Ktr Cold War-TeluguStop.com

ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు టికెట్ల పంచాయతీ పెద్ద వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ అయిన తండ్రీ కొడుకులు కేసీఆర్-కేటీఆర్ మధ్య ఇప్పుడు టికెట్ల వివాదం చోటు చేసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ముందస్తు ఎన్నికల హీట్ స్టార్ట్ అవ్వడంతో సహజంగానే అధికార పార్టీలో టిక్కెట్ల యుద్ధం మొదలయిపోయింది.టీఆర్ఎస్‌లో ఇప్పుడు టికెట్ల రగడ రాష్ట్రంలో తార స్థాయిని వెళ్ళిపోయింది.

కేసీఆర్ వర్గం – కేటీఆర్ వర్గంగా నాయకులు రెండుగా చీలిపోయారు.

ఆ పార్టీలో టికెట్ పొందాలంటే ఏదో ఒక వర్గంతో అంటకాగాల్సిన పరిస్థితి.వీరిద్దరిలో ఎవరినో ఒకరిని మంచి చేసుకోకుండా టికెట్లు పొందలేని పరిస్థితి నెలకొంది.దీంతో ఇది వివాదానికి దారితీస్తోందని తెలుస్తోంది.

ఈ రేసులో నిన్నటి వరకు కేటీఆర్‌కు గట్టి పోటీ అనుకున్న మంత్రి హరీశ్‌రావు పూర్తిగా వెనకపడిపోయారు.మరోపక్క, వారం పదిరోజుల్లోనే తొలి విడతలో 70 మందితో కూడిన జాబితాను విడుదల చేయాలని టీఆర్ ఎస్ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఆ ఎంపికలో కేసీఆర్ -కేటీఆర్ మధ్య విబేధాలు వచ్చాయని, కేసీఆర్ రెడీ చేసిన లిస్ట్ కేటీఆర్ కి నచ్చలేదని ఆ లిస్ట్ లో మార్పు చేర్పులు చేయాల్సిందిగా కేటీఆర్ తన తండ్రిని కోరినట్టు దానికి కేసీఆర్ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.నేను అన్ని సరిచేసుకునే గెలుపు గుర్రాలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పి కేటీఆర్ అభ్యన్తరాన్ని తిప్పికొట్టినట్టు తెలుస్తోంది.ముందస్తు ఎన్నికల సంగతి ఏమో కానీ.అభ్యర్దుల ప్రకటన.సిట్టింగ్ ల కు సీట్ల కటింగ్ రాజకీయంగా పెద్ద దుమారం రేపటం ఖాయమని అంటున్నారు.ఇప్పుడున్న పరిస్థితి, తెప్పించుకున్న సర్వే నివేదికల ప్రకారం దాదాపు ఇరవై మందికి పైగా టికెట్ల అవకాశం కోల్పోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube