కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా ఎలా మారారో మీకు తెలుసా..?

టాలీవుడ్ లో మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని వకీల్ సాబ్ సినిమాతో ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే.థియేటర్లలో, ఓటీటీలో హిట్ అయిన వకీల్ సాబ్ రేపు బుల్లితెరపై ప్రసారం కానుంది.

 Reasons Behind Kalyan Babu Become Star Hero Pawan Kalyan, Ayyappanum Koshiyam, H-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ పేరు మొదట కళ్యాణ్ బాబు కాగా ఆ తర్వాత పేరు మారింది.అయితే కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా ఎలా మారారనే సంగతి ఆయన అభిమానుల్లో చాలామందికి తెలీదు.

ఇప్పటికి కూడా నాగబాబు పవన్ ను కళ్యాణ్ అనే పిలుస్తారనే సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ వల్లే పేరు పవన్ కళ్యాణ్ గా మారిందని తెలుస్తోంది.

తన ప్రతిభతో మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్న పవన్ 1997 సంవత్సరంలో సికింద్రాబాద్ దగ్గర ఉన్న హరి హర కళాభవన్ లో ప్రదర్శన ఇచ్చారు.ఆ ప్రదర్శనతో పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడంతో పాటు ఇషిన్ రై కరాటే ఇండియా అసోసియేషన్ నుంచి పవన్ అనే బిరుదును పొందారు.

Telugu Kalyan Babu, Nagababu, Pawan Kalyan-Movie

మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించి ఎంతో విలువ ఉన్న పవన్ బిరుదు ఆ విధంగా కళ్యాణ్ బాబుకు సొంతం కావడంతో కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా మారారు.ప్రస్తుతం దేశంలో అత్యంత క్రేజ్, ప్రజాదరణ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.శివమ్ హుస్సేన్ అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కరాటే నిపుణుడి దగ్గర పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందారు.కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో పవన్ త్వరలో సినిమా షూటింగ్ లలో పాల్గొననున్నారు.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలతో పాటు పవన్ కొత్త సినిమాలకు కూడా అంగీకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ రాజకీయాలకు కూడా ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube