ఎన్టీఆర్ ముస్లిం గెటప్ వెనుక అసలు కథ ఇదా..?  

Reason behind NTR muslim getup in RRR movie, NTR, Muslim getup, RRR Movie, Koamram bheem, Ramaraju For Bheem Teaser, Rajamouli, Ram Charan, NTR, Independence - Telugu Independence, Koamram Bheem, Muslim Getup, Ntr, Rajamouli, Ram Charan, Ramaraju For Bheem Teaser, Reason Behind Ntr Muslim Getup In Rrr Movie, Rrr Movie

దర్శకధీరుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.రెండు రోజుల క్రితం రామరాజు ఫర్ భీమ్ పేరుతో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కు 17 మిలియన్ల వ్యూస్, పది లక్షల లైకులు వచ్చాయి.

TeluguStop.com - Reasons Behind Junior Ntr Muslim Getup In Rrr Movie

గతంలో ఏ టీజర్ కు రానన్ని లైకులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ టీజర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.అయితే ఈ టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరిత్ర ప్రకారం కొమరం భీమ్ ముస్లిం గెటప్లో కనిపించినట్లు ఆధారాలు లేవు.దీంతో ఆదివాసీలు ఈ టీజర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.మొదటి నుంచి రాజమౌళి ఈ సినిమా చరిత్రకు సంబంధించిన కథ కాదని.

TeluguStop.com - ఎన్టీఆర్ ముస్లిం గెటప్ వెనుక అసలు కథ ఇదా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో దేశభక్తి స్వాతంత్రం లాంటి అంశాలు ఉండవని.ఈ కథ ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు.
చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిసినట్లు ఆధారాలు లేకపోయినా వాళ్లిద్దరూ కలిస్తే ఏ విధంగా ఉంటుందనే ఫిక్షనల్ కథతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది.ముస్లిం గెటప్ లో ఎన్టీఆర్ కనిపించడం సినిమాలో ట్విస్ట్ అని.కథ ప్రకారం ఎన్టీఆర్ ఆ గెటప్ లో కనిపించాడని సమాచారం.మరోవైపు ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాలపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.

రామరాజు ఫర్ భీమ్ టీజర్లో కొన్ని షాట్స్ కాపీ అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆ ఫోటోలను మనీ చెల్లించి రైట్స్ తీసుకుని ఉంటుందని తెలుస్తోంది.దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

#Ram Charan #ReasonBehind #Muslim Getup #Koamram Bheem #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reasons Behind Junior Ntr Muslim Getup In Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..