ఆ అమ్మాయి వల్లే ఈ ఫీల్డ్ లోకి వచ్చానంటున్న హైపర్ ఆది..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హైపర్ ఆది.తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు హైపర్ ఆది స్కిట్లను అభిమానిస్తున్నారు.

 Reasons Behind Hyper Aadi In Sridevi Drama Company Show,hyper Adi,jabardhasth,bigg Boss 5,krack Movie,tollywood,he Shares Emotional Feelings,-TeluguStop.com

యూట్యూబ్ లో సైతం హైపర్ ఆది స్కిట్లు రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.అయితే తాజాగా హైపర్ ఆది తను ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఒక అమ్మాయి కారణం అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఈటీవీలో ప్రతి అదివారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ ప్రోగ్రామ్ లో హైపర్ ఆది మాట్లాడుతూ తాను తాను తొమ్మిదో తరగతిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని ఆ అమ్మాయికి పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.

 Reasons Behind Hyper Aadi In Sridevi Drama Company Show,hyper Adi,jabardhasth,bigg Boss 5,krack Movie,tollywood,he Shares Emotional Feelings,-ఆ అమ్మాయి వల్లే ఈ ఫీల్డ్ లోకి వచ్చానంటున్న హైపర్ ఆది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫీల్డ్ లోకి రావడానికి ఒక రకంగా కారణం ఆ అమ్మాయేనని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు హైపర్ ఆది ఎక్కడా చెప్పని విషయాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రసారమవుతున్న ఎపిసోడ్ లో బయటపెట్టారు.

ఒకవైపు జబర్దస్త్ షోతో, ఢీ షోతో బిజీగా ఉన్న హైపర్ ఆదికి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.గత నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన క్రాక్ సినిమాలో హైపర్ ఆది తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే నటించినా కడుపుబ్బా నవ్వించారు.ఈటీవీ ఈవెంట్లలో కొన్ని ఈవెంట్లకు స్క్రిప్ట్ లు కూడా రాస్తూ ఆ ఈవెంట్లు సక్సెస్ కావడానికి కూడా కారణమవుతున్నారు.మరోవైపు హైపర్ ఆదికి బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ షోలో హైపర్ ఆది పాల్గొంటే మాత్రం సీజన్ 5 పై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు హైపర్ ఆదికి త్వరలో పెళ్లి జరగబోతుందంటూ వార్తలు వైరల్ అవుతుండగా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube