గోపీచంద్ తొలి సినిమా ఆడకపోవడానికి అసలు కారణమిదే?

ఏ హీరోకైనా తొలి సినిమా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.తొలి సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 Reasons Behind Hero Gopichand First Movie Tholi Valapu Failure, First Movie, Gop-TeluguStop.com

తొలివలపు సినిమాతో గోపీచంద్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.గోపీచంద్ కు జోడీగా స్నేహ ఈ సినిమాలో నటించగా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నా ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.

ఈ సినిమా గురించి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కీలక విషయాలను వెల్లడించారు.

మేడ్చల్ పట్టణంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో తొలివలపు కథ తయారు చేయించానని మా నిర్మాత కొడుకు కోసం ఆ కథను తయారు చేయించగా కొన్ని కారణాల వల్ల గోపీచంద్ తో ఆ సినిమా తీశానని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.

రవిశంకర్ ను ఈ మూవీతో విలన్ గా పరిచయం చేశామని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.అయితే సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

Telugu Gopichand, Gopichand Flop, Middlerange, Publicity, Failure, Tholivalapu,

బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వచ్చినా ఎక్కువ రేట్లు చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు వెళ్లిపోయారని ముత్యాల సుబ్బయ్య చెప్పారు.ఆ తర్వాత సొంతంగా సినిమాను విడుదల చేశామని సినిమాకు మంచి సినిమా అని హీరో బాగున్నాడని టాక్ వచ్చిందని అయితే పబ్లిసిటీ చేయకపోవడం వల్ల సినిమా సక్సెస్ సాధించలేదని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.పబ్లిసిటీ చేసి ఉంటే తొలివలపు సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని ముత్యాల సుబ్బయ్య అభిప్రాయపడ్డారు.

Telugu Gopichand, Gopichand Flop, Middlerange, Publicity, Failure, Tholivalapu,

గోపీచంద్ కు హిట్ ఇవ్వాలని భావించానని కానీ రిజల్ట్ మరో విధంగా ఉండటంతో బాధ పడ్డానని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.తొలి సినిమా సక్సెస్ సాధించకపోయినా తరువాత సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని గోపీచంద్ మిడిల్ రేంహ్ హీరో స్టేటస్ ను అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube