ఫరియా అబ్దుల్లా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగకపోవడానికి అసలు కారణమేంటో తెలుసా?

కొత్త హీరోయిన్లకు తొలి సినిమా సక్సెస్ సాధిస్తే ఊహించని స్థాయిలో వాళ్ల కెరీర్ కు ప్లస్ అవుతుందనే సంగతి తెలిసిందే.జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో ప్రేక్షకులకు సుపరిచితమైన ఫరియా అబ్దుల్లా తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.

 Reasons Behind Faria Abdullah Not Interested Photos With Fans , Fans Meet , Fariya Abdullaah , Interesting Facts , Manchu Vishnu , Photo Shoot , Most Eligible Bachelor , Bangarraju-TeluguStop.com

ఈ సినిమా తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో, బంగార్రాజు సినిమాలో ఒక పాటలో ఫరియా అబ్దుల్లా మెరిశారు.

అయితే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చినా ఫరియా అబ్దుల్లా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగడానికి మాత్రం ఇష్టపడటం లేదు.

 Reasons Behind Faria Abdullah Not Interested Photos With Fans , Fans Meet , Fariya Abdullaah , Interesting Facts , Manchu Vishnu , Photo Shoot , Most Eligible Bachelor , Bangarraju-ఫరియా అబ్దుల్లా ఫ్యాన్స్ తో ఫోటోలు దిగక పోవడానికి అసలు కారణమేంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఇదే ప్రశ్న ఎదురు కాగా ఫరియా అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అభిమానులు తనను మాత్రమే కలుస్తారని అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజూ వందల సంఖ్యలో అభిమానులను కలుస్తానని ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

అంతమంది ఫ్యాన్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చే శక్తి నాకు ఉందని మీరు భావిస్తున్నారా? అంటూ అభిమానులను ఫరియా రివర్స్ లో ప్రశ్నించారు.తనకు ఫోటోలు దిగడంపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉండదని ఫరియా అబ్దుల్లా కామెంట్లు చేశారు.

ఆ తర్వాత మరో అభిమాని ఫ్యాన్స్ మీట్ గురించి కామెంట్ చేయగా త్వరలో ఫ్యాన్స్ మీట్ పెడదామని ఫరియా అబ్దుల్లా వెల్లడించారు.

ఆన్ లైన్ ఫ్యాన్స్ మీట్ కు ప్లాన్ చేద్దామని మీరేమని అంటారని ఫరియా అబ్దుల్లా అభిమానులను అడిగారు. కరోనా పరిస్థితులు మెరుగుపడితే తప్పకుండా అందరం బయట కలుద్దామని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా మంచు విష్ణుకు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఫరియా అబ్దుల్లా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Reasons Behind Faria Abdullah Not Interested Photos With Fans , Fans Meet , Fariya Abdullaah , Interesting Facts , Manchu Vishnu , Photo Shoot , Most Eligible Bachelor , Bangarraju - Telugu Bangarraju, Fans Meet, Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube