ప్రముఖ నటుడు అచ్యుత్ చనిపోవడానికి అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

సినీమాల ద్వారా, సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అచ్యుత్ ఒకరనే సంగతి తెలిసిందే.డిగ్రీ చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తితో అచ్యుత్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కు సంబంధించి శిక్షణ తీసుకున్నారు.

 Reasons Behind Famous Actor Achyuth Death Details Here Achyuth, Death Details , Pradeesp , Tollywood, Tammudu , Vasu, Allari Ramu, Daddy-TeluguStop.com

ఇంద్రధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ అచ్యుత్ నటించిన తొలి సీరియల్ కావడం గమనార్హం. ప్రేమ ఎంత మధురం అనే సినిమా ద్వారా నటుడిగా అచ్యుత్ కెరీర్ మొదలైంది.

తమ్ముడు, ఎదురులేని మనిషి, వాసు, అల్లరి రాముడు, డాడీ సినిమాలలోని పాత్రలు అచ్యుత్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.అచ్యుత్ నటనకు పలు అవార్డులు సైతం వచ్చాయి.2002 సంవత్సరంలో గుండెపోటుతో అచ్యుత్ మృతి చెందడం గమనార్హం.ఎఫ్2 సినిమాలో అంతేగా అంతేగా అనే డైలాగ్ తో పాపులర్ అయిన ప్రదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అచ్యుత్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Reasons Behind Famous Actor Achyuth Death Details Here Achyuth, Death Details , Pradeesp , Tollywood, Tammudu , Vasu, Allari Ramu, Daddy-ప్రముఖ నటుడు అచ్యుత్ చనిపోవడానికి అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అచ్యుత్ మరణానికి రీజన్ ఏంటనే ప్రశ్నకు ప్రదీప్ బదులిస్తూ ఏమీ లేదని తెలిపారు.ఎక్కువగా డ్రింక్ చేసి చనిపోయారని వేర్వేరు కారణాలు ఉన్నాయని ప్రచారం జరిగిందని అయితే నిజం ఏంటంటే అచ్యుత్ స్ట్రైన్ అయ్యాడని నాన్ వెజ్, స్మోకింగ్ అన్నీ మానేశాడని అయితే అచ్యుత్ స్వీట్లు ఎక్కువగా తినడంతో పాటు కూల్ డ్రింక్స్ తాగేవాడని ప్రదీప్ చెప్పుకొచ్చారు.

అచ్యుత్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ లో తేడా వచ్చి గుండెపై ప్రభావం పడిందని ఆయన అన్నారు.

అచ్యుత్ అది గమనించలేదని అందువల్ల మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ఎఫ్2 ప్రదీప్ చెప్పుకొచ్చారు.అచ్యుత్ మరణాన్ని నేను తట్టుకోలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.మా పిల్లలు అచ్యుత్ ను బాబాయ్ అనేవారని అంత క్లోజ్ గా ఉండేవాళ్లమని ఆయన కామెంట్లు చేశారు.

అచ్యుత్ మరణాన్ని తలచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుందని ఆయన వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube