టఫ్ ఫైట్ ఇచ్చిన ట్రంప్: ఈ తప్పులే కొంప ముంచాయా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వెలువడుతున్న అన్ని సర్వేల్లోనూ జో బైడెన్‌దే అధికారమని, ఈసారి అధికార మార్పిడి తప్పదని తేటతెల్లమవుతూ వస్తోంది.కానీ అన్ని రకాల అంచనాలను తారుమారు చేస్తూ డొనాల్డ్ ట్రంప్.

 How Donald Trump Lost The Us Presidential Elections, Donald Trump, Us Presidenti-TeluguStop.com

గట్టి పోటీ ఇచ్చారు.ఒకానొక దశలో ఆయన ఎన్నిక ఇక లాంఛనమేనన్న సంకేతాలు వచ్చాయి.

ట్రంప్ సైతం విజయోత్సవాలకు సిద్ధం కావాల్సిందిగా తన మద్ధతుదారులకు పిలుపునిచ్చారు.కానీ స్వింగ్ రాష్ట్రాల్లో పుంజుకున్న బైడెన్.

ట్రంప్ నుంచి అధికారాన్ని లాక్కున్నారు.సర్వేలన్నీ బైడెన్‌కే అనుకూలంగా వచ్చినప్పటికీ పోటీ రసవత్తరంగా సాగింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లలో అత్యధికులు ‘జో’కే జై కొట్టారు.ఫలితంగా కీలక రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్‌ను అధిగమించారు.

ట్రంప్‌లా కాకుండా చాలా కింద స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన బైడెన్‌ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల బరిలో దిగారు.మృధు స్వభావం ఆలోచించి మాట్లాడే స్వభావం ఆయనకు బాగా కలిసి వచ్చాయి.

ట్రంప్‌ను విమర్శకులు ఎంత ఎక్కువగా అపహసించారో, అపఖ్యాతి పాలు చేశారో అంతే ఎక్కువగా ప్రజల్లో ఆయనకు మద్దతు పెరిగింది.ట్రంప్ నాయకత్వ శైలి, సంస్థలు, వ్యవస్థలను అలక్ష్యపరిచే ధోరణిపై విమర్శలు సబబైనవే అయినప్పటికీ అవే సామాన్య ప్రజల్లో ఆయనకు ఆదరణను పెంచాయి.

Telugu Covid, Donald Trump, Donaldtrump, Joe Biden, Obama, Presidential-Telugu N

పాలనా వ్యవహారాలలో ట్రంప్ అనుసరించిన కొన్ని విధానాలు ఎంత అపసవ్యమైనవో కొవిడ్ సంక్షోభం స్పష్టం చేసింది.కరోనా మహమ్మారి తీవ్రతను గుర్తించడంలో, దానిని ఆయన నియంత్రించడంలో నిర్లక్ష్యం అమెరికన్లకు తీవ్ర హాని చేసింది.కరోనా నుంచి రక్షణకు మాస్క్ ధరించడం తప్పనిసరి అని వైద్యనిపుణులు నిర్దేశించినప్పటికీ చాలా రోజుల పాటు మాస్క్ ధరించడానికి ససేమిరా ఆయన అన్నారు.చివరికి తానే ఆ మహమ్మారి కోరల్లో చిక్కారు.

ఒబామా హయాంలో తెచ్చిన ఆరోగ్య బీమా, ఒబామా కేర్‌ను వ్యతిరేకించిన ట్రంప్‌ అందుకు ప్రత్యామ్నాయం చూపి ప్రజల్ని మెప్పించడంలో విఫలమయ్యారు.కొవిడ్‌ను ట్రంప్‌ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చేయడం.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కంటే ఆర్థిక వ్యవస్థ తెరిచేందుకే అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఆగ్రహావేశాలకు కారణమైంది.

ఇదే సమయంలో అమెరికాలో నల్ల జాతీయులపై అకృత్యాలు పెరిగిపోవడం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్రంప్‌ ప్రసంగాలు చేయడం రిపబ్లికన్లకు చేటు తెచ్చింది.

అమెరికా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న జో బైడెన్‌కు‌.ఒబామా హయాంలో రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

ఇప్పుడున్న పరిస్ధితుల్లో అనుభవజ్ఞుడైతేనే అమెరికాను గాడిలో పెట్టగలరనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది.

Telugu Covid, Donald Trump, Donaldtrump, Joe Biden, Obama, Presidential-Telugu N

కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుండడటం, వాతావరణ మార్పులు తలెత్తడంలాంటి పరిణామాల వల్లే నిరంతరం కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో అడవులు తగలబడి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరగడం కూడా అమెరికాన్లను ఆలోచింపజేసింది.2016లో ట్రంప్‌ అధికార బాధ్యతలు స్వీకరించగానే ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగి అమెరికాతో పాటు ప్రపంచానికి పెద్ద షాకిచ్చారు.అయితే దీనిపై వ్యూహాత్మకంగా వ్యవహిరించిన బైడెన్ తాము అధికారంలోకి వస్తే తిరిగి ప్యారిస్‌ ఒప్పందంలో చేరతామని చెప్పడంతో పర్యావరణ ప్రేమికులతో పాటు కార్చిచ్చు వంటి ఘటనల్లో బాధితులను తీవ్రంగా ఆలోచింపజేసింది.

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్లు సాంకేతిక పరమైన తప్పులు కొన్ని అయితే.స్వయం కృతం కొన్ని కలిసి అంతిమంగా ట్రంప్‌ను రెండోసారి అధికార పీఠానికి దూరం చేశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube