ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?!

మన చుట్టూ ఉండే కొన్ని వస్తువులల్లో అనేక రహస్యాలు, అబ్బురపరిచే విషయాలు, వింతలు ఉంటాయి.కానీ.

 Reasons Behind Doctors Wearing Green And Blue Color Dresses In Operation Theater-TeluguStop.com

ఆ విషయాలు బయటికి వచ్చే వరకు మనం వాటిని గుర్తించము.సాధారణంగా మనం చాల సార్లు చుసిన విషయమే కానీ.

మనం ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు.వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తారు ప్రజలు.

డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ రోగుల ప్రాణాలను నిలపడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు.అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎప్పుడూ ఆకుపచ్చ లేదా నీలం రంగు ఉన్న దుస్తులను ఎందుకు ధరిస్తారో ఒక్కసారి తెలుసుకుందామా.

సాధారణంగా వైద్యులు ఆపరేషన్ థియేటర్ లో కానీ, ఆసుపత్రిలో కూడా ఎక్కువగా పరదాలు ఆకుపచ్చ లేదా నీలం రంగులోనే ఉంటాయి.అదే క్రమంలో మాస్కులు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటాయి.

ఇప్పుడు మీ మనసులో కూడా ప్రశ్న తలెత్తి ఉంటుంది.ఈ రెండు రంగులలో ఇంత ప్రత్యేకత ఏమిటి అని.అక్కడికే వస్తున్నాం ఉండండి.

Telugu Blue, Doctors, Green Dresses, Pressure, Theater Colors, Scientific, Colou

ఇక గతంలో వైద్యుల నుంచి ఆసుపత్రికి వచ్చే సిబ్బంది అందరూ తెల్లని దుస్తులు ధరించేవారట.కాని 1914 సంవత్సరంలో ఓ పేరమోసిన డాక్టర్ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు.రీజన్ ఏంటంటే.

ఆపరేషన్ సమయంలో మానవ శరీరం, రక్తం, అంతర్గత అవయవాలను డాక్టర్లు ఎక్కువగా చూస్తారు.ఈ సమయంలో వారి మానసిక ఒత్తిడికి లోనవుతారు.

ఆకుపచ్చ రంగును చూడటం వల్ల.ఉద్రిక్తత నుంచి స్వాంతన లభిస్తుందట.

అందుకే అప్పటినుంచి ఈ పద్దతిని అవలంభించారు.

అయితే దీనిని మనం శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిస్తే, మన కళ్ల  జీవ నిర్మాణం ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను చూడగలిగే విధంగా తయారుచేయబడింది.

మానవ కళ్లు ఈ రంగుల మిశ్రమం నుంచి తయారైన కోట్ల ఇతర రంగులను గుర్తించగలవు.కానీ ఈ రంగులతో పోలిస్తే, ఆకుపచ్చ లేదా నీలం రంగు మాత్రమే మన కళ్లకు ఉత్తమంగా కనిపిస్తుంది.

ఈ కారణంగా, ఆకుపచ్చ, నీలం రంగులు కళ్లకి మంచివిగా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube