దేవీ శ్రీ ప్రసాద్ గడ్డం వెనుక అసలు కథ ఇదా..?

దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగులో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దేవీ శ్రీ ప్రసాద్.ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి వచ్చినా దేవీ శ్రీ ప్రసాద్ కు ఒకరిద్దరు మినహా ఎవ్వరూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.

 Reasons Behind Devisriprasad Beard Look, Allu Arjun, Beard, Devi Sri Prasad, Pus-TeluguStop.com

అయితే కొన్నేళ్ల క్రితం దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఆ మూవీ కార్యరూపం దాల్చలేదు.

అయితే గత కొన్ని నెలల నుంచి ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే దేవీ శ్రీ ప్రసాద్ గడ్డంతో కనిపిస్తున్నారు.అయితే దేవి శ్రీ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నారని ఆ పాత్ర కోసమే గడ్డం పెంచుతున్నారని తెలుస్తోంది.

సుకుమార్ ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ కు తన సినిమాలో అవకాశం ఇస్తున్నారని సమాచారం.దేవి శ్రీ ప్రసాద్ గుబురు గడ్డానికి అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Beard, Devirsri Prasad, Pushpa, Sukumar-Movie

రంగస్థలం తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో కూలీ నుంచి ఎర్రచంద్రం స్మగ్లర్ గా మారే పాత్రలో ఆల్లు అర్జున్ నటించనున్నారని.అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరు పుష్పరాజ్ అని తెలుస్తోంది.పుష్ప సినిమాకు సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ అదే సినిమాతో నటించబోతున్నట్టు సమాచారం.

గతంలో పలు సినిమాల్లో కొన్ని సెకన్ల పాటు కనిపించిన దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలో మాత్రం ఎక్కువ సమయం కనిపించనున్నారని తెలుస్తోంది.అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.

దేవి శ్రీ నటించి అతని పాత్రకు మంచి గుర్తింపు వస్తే భవిష్యత్తులో దేవి శ్రీ నటుడిగా కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube