ఆంధ్ర, సీడెడ్ లో నాని దసరా మూవీకి నెగిటివ్ టాక్ వెనుక కారణాలు ఇవే!

నాని హీరోగా నటించిన దసరా( Dussehra ) మూవీ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఒక మిడిల్ రేంజ్ హీరో సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించడం దసరా విషయంలోనే జరిగింది.

 Reasons Behind Dasara Movie Negitive Talk Details Here Goes Viral , Dasara Mov-TeluguStop.com

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను మెప్పించింది.ధరణి రోల్ కోసం నాని పడిన కష్టానికి మంచి ఫలితం దక్కింది.

నైజాం, ఓవర్సీస్( Nizam, Overseas ) లో రికార్డులుక్రియేట్ చేస్తున్న ఈ సినిమా విచిత్రంగా ఆంధ్ర, సీడెడ్( Andhra, seeded ) లో మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లేదు.ఈ సినిమాకు ఈ రెండు ఏరియాలలో ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాకపోవడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు.ఈ రెండు ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు సైతం ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటోంది.గతంలో పలు సినిమాల విషయంలో ఇదే సీన్ రిపీట్ అయింది.

సినిమాలో నాని కొన్ని డైలాగ్స్ చాలా వేగంగా చెప్పడంతో ఆ డైలాగ్స్ అందరికీ అర్థం కావడం లేదని కొన్ని పదాలు ఆంధ్ర, సీడెడ్ ప్రజలకు కొత్త కావడంతో కలెక్షన్లు తగ్గాయని తెలుస్తోంది.ఆంధ్రలో ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉన్నా మరీ లాభాలను అందించడం కష్టమేనని తెలుస్తోంది.తెలంగాణ మాండలీకంలో గతంలో డైలాగ్స్ చెప్పిన నటులు స్లోగా చెప్పడం వల్ల అప్పుడు రాని సమస్య ఇప్పుడు వచ్చింది.తన తర్వాత సినిమాలకు సంబంధించి ఈ పొరపాట్లు జరగకుండా నాని( Nani ) జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.

నాని భవిష్యత్తు సినిమాలు సైతం భారీ రేంజ్ లోనే ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇతర భాషల్లో దసరా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా నాని రాబోయే రోజుల్లో పాన్ ఇండియా హీరోగా ఎదగడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube