వేణుమాధవ్ చనిపోవడానికి అసలు కారణం ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరు.దాదాపు 400 సినిమాల్లో నటించిన వేణుమాధవ్ తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో అంచెలంచెలుగా ఎదిగారు.

 Reasons Behind Comedian  Venumadhav Death  Venu Madhavu, Tollywood, Venu Madhavu-TeluguStop.com

సంప్రదాయం సినిమా 1996లో కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ గతేడాది ఆరోగ్య సమస్యతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

అప్పట్లో వేణుమాధవ్ మృతికి ఆరోగ్య సంబంధిత సమస్యలే కారణమని వార్తలు వచ్చినా ఆయన ఆకస్మిక మృతికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు.

తాజాగా వేణుమాధవ్ కుమారులు మాట్లాడుతూ వేణుమాధవ్ మృతికి గల కారణాలను వెల్లడించారు.వేణుమాధవ్ కు మద్యం అలవాటు ఉండేదని అయితే కఠినంగా డైట్ ను పాటించడం వల్లే ఆయన ఆరోగ్య సమస్యల బారిన పడ్డాడని పేర్కొన్నారు.

కొందరు రాజకీయ నాయకులు పొలిటికల్ గా కూడా వేణుమాధవ్ ను టార్గెట్ చేశారని ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు.సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల డెంగ్యూ బారిన పడ్డ సమయంలో వేణుమాధవ్ ఊపిరితిత్తులు కొంత దెబ్బతిన్నాయని తెలిపారు.

వేణుమాధవ్ ఆరోగ్యం గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయని.కొందరు రాజకీయ నాయకులు వేణుమాధవ్ ఆరోగ్యం గురించి తప్పుగా ప్రచారం చేశారని తెలిపారు.

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తామని.అయితే ఏ పార్టీలో చేరబోతున్నామో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలో చేరాలనుకుంటున్నామని తెలిపారు.వేణుమాధవ్ చనిపోయే వరకు ఆయనకు ఇండస్ట్రీలో అందరితో సత్సంబంధాలు ఉన్నాయని ఆయనకు ఇండస్ట్రీకి చెందిన కొందరితో విభేదాలు ఉన్నట్టు వైరల్ అయిన వార్తలు నిజం కాదని తెలిపారు.కొంతమంది సినీపెద్దలు తమతో మాట్లాడుతూ ఉంటారని వేణుమాధవ్ కుమారులు తెలిపారు.

బయట విషయాలను ఇంట్లో చర్చించడానికి వేణుమాధవ్ ఎక్కువగా ఇష్టపడరని ఇంట్లో ఎక్కువగా సంతోషంగా గడిపేవారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube