కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి తిరిగి రావడం పై చర్చనీయాంశంగా మారింది.ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులను, ఎవరితోను భేటీ కాకపోవడం అర్థం కాని ప్రశ్నగా మిగిలింది.

 Reasons Behind Cm Kcr Delhi Tour Details, Cm Kcr, Kcr Delhi Tour, Kcr National P-TeluguStop.com

గత ఆరు నెలలుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ దేశంలోని వివిధ పార్టీల నేతలను ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలిసి బిజెపికి ప్రత్యామ్నాయ కూటమిని తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.అయితే దానికి ఒక్క కాంగ్రెస్ జాతీయ పార్టీ మినహా మిగిలిన ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కలిసి వచ్చారు.

ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపారు.

తాము జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రచార ఆర్భాటాలకు దిగుతూ తమకు హోర్డింగులు, మెట్రో పిల్లర్లు దొరకకుండా చేశారని విమర్శించారు.

అటు భారతీయ జనతా పార్టీ ఇటు టిఆర్ఎస్ ల మధ్య విమర్శల పర్వం కొనసాగింది.తదుపరి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక అయ్యారు.

ఆ తదుపరి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ సమావేశం నిర్వహించి రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు.

అయితే పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Telugu Akhilesh Yadav, Cm Kcr, Draupadi Murmu, Kcr Delhi, Kcr National, Margaret

సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్ నుండి బైక్ కట్ చేస్తే పార్లమెంట్ బయట ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు.మరోవైపు ఈ పర్యటనలో కొత్త జాతీయ పార్టీ, జాతీయ రాజకీయ పరిణామాలపై పలు పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన‌క‌నాయ‌ని,.విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అళ్వాకు మద్దతు కోసం విపక్షాలు దిల్లీలో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆహ్వానించినట్లు టిఆర్ఎస్ వ‌ర్గాలు చెప్పినా… కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏడు రోజులు ఉన్నా ఎవరితో ఎందుకు భేటీ కాలేదన్నది సస్పెన్స్‌గా మారింది.

Telugu Akhilesh Yadav, Cm Kcr, Draupadi Murmu, Kcr Delhi, Kcr National, Margaret

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కెసిఆర్ తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.దీనికి సంబంధించి అధికారికంగా సీఎం కేసీఆర్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కలిసిన ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఎవరిని కలవకుండా ఎందుకు వెనక్కి ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube