మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్.. ఫీలవుతున్న ఫ్యాన్స్..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు చెక్ మూవీ ఫలితం భారీ షాక్ ఇచ్చింది.రిలీజ్ రోజు యావరేజ్ టాక్ రావడం, థియేట్రికల్ హక్కులు తక్కువ మొత్తానికే అమ్ముడవడంతో ఈ సినిమా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని నితిన్ ఫ్యాన్స్ భావించారు.

 Reasons Behind Check Movie Collections Huge Drop-TeluguStop.com

అయితే చెక్ మూవీ కలెక్షన్లు మాత్రం నితిన్ కు, నితిన్ ఫ్యాన్స్ కు షాకిచ్చేలా ఉన్నాయి.మూడు రోజుల్లో ఈ సినిమాకు కేవలం 6.88 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది.

చెక్ మూవీకి ఇంకో 10 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే మాత్రమే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది.

 Reasons Behind Check Movie Collections Huge Drop-మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్.. ఫీలవుతున్న ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీక్ డేస్ లో చెక్ ఆ స్థాయిలో కలెక్షన్లకు రాబడుతుందా ? అనే అనుమానమే అని చెప్పవచ్చు.బీ, సీ సెంటర్లలో చెక్ సినిమాకు ఆదరణ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారిందని చెప్పవచ్చు.

భీష్మ హిట్ తో నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకునే లోపు చెక్ మూవీతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు.

Telugu 6.88 Crores, Check, Ishq, Movie Collection, Nithin Flop, Rang De Movie-Movie

నితిన్ కెరీర్ లో హిట్టైన ఈ మధ్య కాలంలో హిట్టైన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, భీష్మ సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన్ లవ్ స్టోరీలని నితిన్ అలాంటి సినిమా కథలనే ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నితిన్ కు ప్రయోగాత్మక సినిమాలు పెద్దగా కలిసిరాలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.వైవిధ్యమైన కథలను ఎంచుకోవద్దని నితిన్ కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

మరి నితిన్ ఇకనైనా ఫ్యాన్స్ సూచనలను పాటిస్తారేమో చూడాల్సి ఉంది.మూడు వారాల క్రితం విడుదలైన ఉప్పెన ఇప్పటికీ మంచి కలెక్షన్లను సాధిస్తుంటే చెక్ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోవడం గమనార్హం.

త్వరలో విడుదల కాబోతున్న రంగ్ దే మూవీపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు.

#Check #Ishq #Rang De Movie #6.88 Crores #Nithin Flop

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు