బాబు హస్తిన ప్రయాణం అందుకోసమేనా?

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు దగ్గరికి వచ్చే కొద్దీ రాజకీయ పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి.ఎడతెరిపిలేని పర్యటనలు, రోడ్షోలతో హోరెత్తిస్తున్నాయి.

ఎన్నికలనాటి వాతావరణాన్ని ఇప్పటినుంచే సృష్టించే విధంగా ప్రధాన ప్రతిపక్షం తో కూడా జనసేన ప్రయత్నిస్తున్నాయి.అయితే ఉన్నట్టుండి చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీకి పయనమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

దీని వెనక అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఎన్డీఏ( NDA )లో తెలుగుదేశం ఎంట్రీపై కేంద్ర పెద్దలతో తేల్చుకోవడానికే బాబు హస్తిన ప్రయాణం అవుతున్నారంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా )లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా దొంగ వోట్ల ఏరివేతపై పెద్ద ఎత్తున తెలుగుదేశం ఆందోళన చేస్తుంది.

గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రులు ఎన్నికలలో దొంగ ఓట్లు కీలకంగా మారాయని భావిస్తున్న టిడిపి దానిపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని చూస్తుంది.

Advertisement

ఈసీ ఇప్పటికే ఓట్ల వెరిఫికేషన్ నిర్వహించినప్పటికీ, అది సంతృప్తికర స్థాయిలో జరగలేదని చాలాచోట్ల రాష్ట్ర ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం భావిస్తుంది.దానికి సంబంధించిన చాలా సాక్షాదారాలను టిడిపి అడ్మినిస్ట్రేషన్ వింగ్ సంపాదించిందని ,వాటిని ఆధారంగా చూపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి బాబు ఢిల్లీ పయనమవుతున్నారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేస్తుంది.

అయితే ఈ విషయంతో పాటు పొత్తుల విషయాన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్లాన్ చేసుకోవడం సులువుతుందన్న ఉద్దేశంతోనే కేంద్ర పెద్దల తో చర్చలు జరపడానికి చంద్రబాబు ఢిల్లీ( Delhi )కి వెళుతున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే ఎన్ డి ఏ సభకు చంద్రబాబుకు ఆహ్వానం అందుతుందని అందరూ భావించినప్పటికీ ఆహ్వానం అందలేదు.అయితే ఎన్డీఏకి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయంటూ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్న దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తు చర్చలు అయితే సజీవంగానే ఉంటాయని చెప్పవచ్చు మరి కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అవుతారో లేదో మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది .

Advertisement

తాజా వార్తలు