బిగ్ బాస్ షో ఫ్లాప్ కావడానికి అసలు కారణమిదే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగు వారాల క్రితం స్టార్ మా ఛానెల్ లో గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావడంతో బిగ్ బాస్ షో అంచనాలకు మించి సక్సెస్ అవుతుందని అందరూ భావించారు.

 Reasons Behind Bigg Bsoss Show Failure Telugu Big Boss 4, Nagarjuna, Wild Dog,-TeluguStop.com

అయితే అంచనాలకు భిన్నంగా బిగ్ బాస్ షో ఫ్లాప్ అవుతోంది.బిగ్ బాస్ షో ఫ్లాప్ కావడానికి గల కారణాలను అన్వేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రధానంగా బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనే ఫెయిల్ అయింది.గత సీజన్లలా పరిచయం ఉన్న కంటెస్టెంట్లు ఈ సీజన్ లో చాలా తక్కువమంది ఉన్నారు.

గతంలో ఎంతమంది విమర్శలు చేసినా షో సక్సెస్ అయిందనే మాట వాస్తవం.అయితే ఈసారి టాస్కులు కానీ ఎలిమినేషన్ ప్రక్రియ కానీ ఏ మాత్రం ఆసక్తిని క్రియేట్ చేయడం లేదు.

అయితే గత సీజన్లలో ఈ షోకు మెయిన్ గా వ్యవహరించిన అభిషేక్ అనే వ్యక్తి ఈ షోకు దూరం కావడమే షో ఫ్లాప్ కావడానికి కారణమని తెలుస్తోంది.

ఈ సీజన్ లో అభిషేక్ లేని లోటు స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తోంది.

ఫలితంగా షో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది.బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్రవేశపెడుతున్నా వాళ్లు కూడా షోకు ప్లస్ కాలేకపోతున్నారు.

అభిషేక్ ఈ షోకు ఎందుకు దూరమయ్యాడో తెలీదు కానీ ఆయన దూరం కావడం షోకు మాత్రం మైనస్ గా మారుతోంది.కెప్టెన్సీ టాస్క్ లు, నామినేషన్ ప్రక్రియ కూడా ఆకట్టుకోవడం లేదు.

గత సీజన్లలా ఈ సీజన్ లో సినిమా సెలబ్రిటీల సందడి లేదు.ఇదే విధంగా షో పరిస్థితి కొనసాగితే బిగ్ బాస్ సీజన్ 5 ఉంటుందో ఉండదో చెప్పలేం.

మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ కోసం గోవాకు వెళ్లడంతో వీకెండ్ ఎపిసోడ్లలో ఆయనే ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube