మోనాల్ సేవ్ కావడానికి కారణం వాళ్లేనా..?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు అనేకసార్లు ఎలిమినేషన్ కు చాలాసార్లు నామినేట్ కావడంతో పాటు ఊహించని విధంగా ఎలిమినేషన్ నుంచి మోనాల్ తప్పించుకున్నారు.దీంతో నెటిజన్లలో చాలామంది బిగ్ బాస్ దత్తపుత్రిక కావడం వల్ల మోనాల్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుందని భావించారు.

TeluguStop.com - Reasons Behind Bigg Boss Saving Monal Every Time

ఈ వారం ఎలిమినేషన్ కు అవినాష్, మోనాల్, అరియానా, అఖిల్ సార్థక్ నామినేట్ కాగా నిన్న నాగార్జున మోనాల్ ను సేవ్ చేశారు.

రికార్డు స్థాయిలో ఓట్లు రావడం వల్లే మోనాల్ సేవ్ అయినట్టు తెలుస్తోంది.

TeluguStop.com - మోనాల్ సేవ్ కావడానికి కారణం వాళ్లేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే నిజంగానే మోనాల్ కు రికార్డు స్థాయిలో ఓట్లు పోల్ అయ్యాయని సమాచారం.అయితే నిజానికి ఈమెకు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు రాలేదు.

ప్రేక్షకుల్లో సైతం మోనాల్ పై పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ లేదు.అయితే అభిజిత్ ఫ్యాన్స్ ప్రతిసారి మోనాల్ కు ఓట్లు పోల్ చేస్తున్నారని అభిజిత్ ఫ్యాన్స్ వల్లే మోనాల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ వారం అభిజిత్ నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి, హారిక కెప్టెన్ కావడానికి కూడా మోనాల్ కారణం.దీంతో హారిక అభిమానులు సైతం ఈ వారం మోనాల్ కే ఓట్లు వేశారని తెలుస్తోంది.ఈ వారం నామినేట్ అయిన కంటెస్టంట్లు అందరికీ పోలైన ఓట్లలో దాదాపు సగం ఓట్లు హారికకే పడ్డాయని సమాచారం.దీంతో మోనాల్ కు టాప్ 5లో కూడా చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు మూడు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇకపై టాస్కులు కఠినంగా ఉండబోతున్నాయని సమాచారం.ఈ మూడు వారాల్లో కంటెస్టెంట్ల పెర్ఫామెన్స్ ను బట్టే బిగ్ బాస్ షో సీజన్ 4కు విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తేలనుంది.

#Abhijit Fans #BiggBoss #Harika Fans #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు