బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియ ఎలిమినేట్ కావడానికి కారణాలివే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోలో ఈ వారం ప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.గత రెండు రోజుల నుంచి ప్రియ ఎలిమినేట్ అవుతారని జరుగుతున్న ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది.

 Reasons Behind Bigg Boss Contestant Priya Elimination Details, Bigg Boss Contest-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎంతోమంది కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రియ ఎలిమినేట్ కావడం కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే బిగ్ బాస్ హౌస్ ద్వారా ఏ మాత్రం పాపులారిటీ లేని కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం స్టార్ స్టేటస్ అందుకుంటున్నారు.

గతంలో కూడా ప్రియ ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ప్రేక్షకుల్లో ప్రియపై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఆమెకు కలిసొచ్చింది.అయితే సన్నీతో శృతి మించి గొడవ పడటం ఆమెకు మైనస్ గా మారింది.

సన్నీని రెచ్చగొట్టేలా ప్రియ కామెంట్లు చేయడంతో నార్మల్ ఆడియన్స్ కూడా ప్రియ ప్రవర్తనను చూసి షాకయ్యారు.బంగారు కోడిపెట్ట టాస్క్ సమయంలో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కామెంట్లు చేయడం ఆమెకు మైనస్ అయింది.

ప్రియ ప్రవర్తన బాగా ఉండి ఉంటే ఆమెకు బదులుగా యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యేవారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Anee Master, Biggboss, Nagarjuna, Priya, Priyanka Singh, Sunny-Movie

మరోవైపు ప్రియ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.బిగ్ బాస్ షో వల్ల ప్రపంచంలో ఏ మూలనైనా బ్రతకవచ్చని నేర్చుకున్నానని ప్రియ తెలిపారు.రోజూ ఉదయాన్నే ప్రియాంక సింగ్ ముఖం చూసి లేస్తానని ప్రియ చెప్పుకొచ్చారు.

Telugu Anee Master, Biggboss, Nagarjuna, Priya, Priyanka Singh, Sunny-Movie

ప్రియాంక సింగ్ ముఖం చూడకుండా నిద్ర లేచిన రోజున గొడవ జరుగుతుందని ప్రియ పేర్కొన్నారు.సన్నీని టార్గెట్ చేసి రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానని తిట్టడం ఇలా ప్రియ చేసిన చిన్నచిన్న తప్పులే ఆమె ఎలిమినేషన్ కు పరోక్షంగా కారణమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube