గంగవ్వ ఎలిమినేషన్ కు అసలు కారణం ఇదేనా..?

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోలో శనివారం రోజు ఎవరూ ఊహించని విధంగా గంగవ్వ ఎలిమినేట్ అయింది.అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ ఎలిమినేట్ అయినప్పటికీ ఆమె ఎలిమినేషన్ గురించి ప్రేక్షకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

 Reasons Behind Bigg Boss Contestant Gangavva Elimination, Bigg Boss Contestant G-TeluguStop.com

అరవై ఏళ్ల గంగవ్వను బిగ్ బాస్ షోకు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని బిగ్ బాస్ ప్రారంభమైన మొదట్లోనే వినిపించాయి.

బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వతో ఐదు వారాలు ఉండాలని అగ్రిమెంట్ చేయించుకున్నారని ఐదు వారాల తర్వాత గంగవ్వ ఎలిమినేట్ అవుతుందని గతంలోనే వార్తలు రాగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి.

గంగవ్వను అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటం వల్ల ఇంటికి పంపిస్తున్నామని బిగ్ బాస్ చెప్పినా రెండో వారంలో గంగవ్వ అనారోగ్యంతో బాధ పడిన సమయంలో ఎందుకు పంపించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చివరకు ఒప్పందం ప్రకారమే ఆమెను హౌస్ నుంచి పంపించారని.

గంగవ్వ కనీసం ఐదు వారాలు ఉంటే రూరల్ ఆడియెన్స్ బిగ్ బాస్ షో చూస్తారని బిగ్ బాస్ నిర్వాహకులు భావించినట్లు సమాచారం.బిగ్ బాస్ ఇచ్చే డబ్బుతో ఇల్లు కట్టించుకుందామని భావించిన గంగవ్వకు ఎట్టకేలకు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ తో పాటు నాగార్జున ఇచ్చిన హామీ వల్ల ఇల్లు కోరిక నెరవేరింది.

మరోవైపు గంగవ్వ వల్ల బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లకు అన్యాయం జరుగుతోందని గత కొన్ని వారాల నుంచి నెటిజన్లు వాపోతున్నారు.

కంటెస్టెంట్లలో కొందరు గంగవ్వతో సన్నిహితంగా మెలుగుతూ గంగవ్వను నామినేట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.

కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడేందుకు గంగవ్వను పావులా వాడుకుంటూ ఉండటంతో బిగ్ బాస్ షోపై ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి కలగట్లేదు.దీంతో బిగ్ బాస్ యాజమాన్యం గంగవ్వను ఇంటి నుంచి బయటకు పంపించడానికి సుముఖత వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube