తెలంగాణలో బంగార్రాజు కలెక్షన్లు తక్కువగా ఉండటానికి కారణమిదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకుని తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈరోజు నుంచి ఏపీలో 50 శాతం నిబంధనలతో పాటు నైట్ కర్ఫ్యూ అమలు కానున్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

 Reasons Behind Bangarraju Movie Telangana Collections Decrease Details, Bangarra-TeluguStop.com

అయితే బంగార్రాజు సినిమా తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే మెరుగైన కలెక్షన్లను సాధిస్తోంది.

నాలుగు రోజుల్లో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన బంగార్రాజు మరో పది కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

అయితే తెలంగాణలో నాలుగు రోజుల్లో బంగార్రాజు కేవలం 7 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.ఏపీతో పోలిస్తే తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి.

అయినప్పటికీ బంగార్రాజు ఏపీలో ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించడం గమనార్హం.

సంక్రాంతి పండుగకు ఆంధ్రా వాళ్లు సొంత ప్రాంతాలకు వెళ్లడం వల్లే నైజాంలో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయని నాగ్ అభిమానులు భావిస్తున్నారు.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Ramyakrishna, Rowdy

సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో నైజాంలో ఈ సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.మరోవైపు సంక్రాంతికి విడుదలైన మిగతా మూడు సినిమాలు నష్టాలను మిగల్చటం గ్యారంటీ అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.నైజాంలో బంగార్రాజు సినిమాను నాగ్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Ramyakrishna, Rowdy

నైజాంలో రౌడీ బాయ్స్ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కావడం బంగార్రాజుకు సమస్య అయిందని తెలుస్తోంది.బంగార్రాజుకు భారీస్థాయిలో థియేటర్లు దక్కకపోవడం వల్ల ఈ సినిమాకు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రాలేదని సమాచారం.బంగార్రాజు ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube