బాలకృష్ణ పేరు బాలయ్యగా ఏ విధంగా మారిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణను ప్రేమగా బాలయ్య అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.బాలకృష్ణ గతేడాది అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

 Reasons Behind Balakrishna Name Changed Details Here Goes Viral Balakrishna, Akhanda, B.gopal, Balayya, Tollywood, Gopichand Malinani-TeluguStop.com

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తుండగా దసరా పండుగ కానుకగా బాలయ్య ఈ సినిమాను విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

జై బాలయ్య అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.అయితే బాలకృష్ణ అనే పేరు బాలయ్యగావిధంగా మారిందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం చాలామంది అభిమానులకు తెలియదు.

 Reasons Behind Balakrishna Name Changed Details Here Goes Viral Balakrishna, Akhanda, B.gopal, Balayya, Tollywood, Gopichand Malinani-బాలకృష్ణ పేరు బాలయ్యగా ఏ విధంగా మారిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బాలకృష్ణకు బాలయ్య అనే పేరు రావడానికి పరోక్షంగా బి.గోపాల్ కారణమయ్యారు.బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ లో మొత్తం 5 సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో పలనాటి బ్రహ్మనాయుడు మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి.ఈ సినిమా కోసం బి.గోపాల్ బాలయ్య అనే పదం వినిపించేలా పాట రాయాలని సూచించారు.బి.గోపాల్ సూచనల ప్రకారం జొన్నవిత్తుల బాలయ్యా బాలయ్యా గుండెల్లో గోలయ్యా పాటను రాయగా ఈ పాట ఊహించని స్థాయిలో హిట్ అయిందనే సంగతి తెలిసిందే.ఆ తర్వాత నుంచి ఫ్యాన్స్ సైతం బాలకృష్ణను బాలయ్య అని పిలవడం మొదలుపెట్టారు.తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాలయ్య భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.బాలయ్య రేంజ్ సినిమాసినిమాకు ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube