ఆ వ్యాధి వల్లే అనుష్క బరువు పెరిగిందా.. అభిమానులు అయ్యో పాపమనేలా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క( Anushka ) ప్రస్తుతం మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి( Miss Shetty Mrs.Polishetty ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొనగా మరికొన్ని నెలల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే ఈ మధ్య కాలంలో అనుష్క ఫోటోలలో, వీడియోలలో బొద్దుగా కనిపిస్తున్నారు.

 Reasons Behind Anushka Weight Gain Details Here Goes Viral In Social Media, Anus-TeluguStop.com

అనుష్క లుక్ ను చూసిన ఫ్యాన్స్ ఒకింత షాకవుతున్నారు.అయితే అనుష్క బరువు పెరగడానికి థైరాయిడ్ కారణమని సమాచారం.

బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా థైరాయిడ్( Thyroid ) వల్ల ఆమె తగ్గలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనుష్క స్లిమ్ లుక్ లోకి మారితే ఆమెకు ఆఫర్లు పెరుగుతాయని మరి కొందరు చెబుతున్నారు.

అనుష్క థైరాయిడ్ తో బాధ పడుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.సీనియర్ హీరోలకు జోడీగా కూడా అనుష్కకు ఆఫర్లు రావడం లేదు.

అనుష్క పారితోషికం కోటి రూపాయలకు అటూఇటుగా ఉంది.ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో కూడా అనుష్కకు ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు.అనుష్క భిన్నమైన కథలకు ఓకే చెప్పాలని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.తన స్థాయిని పెంచే ప్రాజెక్ట్ లలో అనుష్క నటిస్తే బాగుంటుందని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.

అనుష్కకు పూర్వ వైభవం రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.సరైన కథలను ఎంచుకొని అనుష్క సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.అనుష్క ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అనుష్క పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని కూడా అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.స్టార్ హీరోయిన్ అనుష్కకు 2023 సంవత్సరం కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube