బిగ్ బాస్ షోకు అనుష్క వెళ్లకపోవడానికి కారణం ఇదే!  

Reasons Behind Anushka Not attending Nishabdam Movie Promotions, Nishabdam Movie Promotions, Anushka Shetty, Bigg Boss House, Online Promotions - Telugu Anushka, Anushka Bigg Boss, Anushka Shetty, Bigg Boss 4, Bigg Boss House, Nishabdam Movie Promotions, Nishshbdam, Online Promotions, Reasons Behind Anushka Not Attending Nishabdam Movie Promotions

బుల్లితెర రియాలిటీ షోలలో మరే షోకు లేని స్థాయిలో బిగ్ బాస్ షో గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.

TeluguStop.com - Reasons Behind Anushka Bigg Boss Show

ఈ షోకు హాజరై కొందరు సెలబ్రిటీలు గత సీజన్లలో తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను చేసుకున్నారు.బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన తరువాత నిశ్శబ్దం సినిమా హీరోయిన్ అనుష్క బిగ్ బాస్ షోకు రానుందని వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
గత ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ లో అనుష్క సందడి చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.అయితే అందరి అంచనాలకు భిన్నంగా అనుష్క మాత్రం బిగ్ బాస్ హౌస్ కు రాలేదు.

దీంతో అనుష్క వస్తుందని ఆశించిన బిగ్ బాస్ అభిమానులు ఢీలా పడ్డారు.కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు నిశ్శబ్దం యూనిట్ ను బిగ్ బాస్ హౌస్ కు అనుమతించలేదని వార్తలు రాగా తాజాగా అనుష్క బిగ్ బాస్ లో పాల్గొనకపోవడానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

TeluguStop.com - బిగ్ బాస్ షోకు అనుష్క వెళ్లకపోవడానికి కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ అనుష్క బిగ్ బాస్ హౌస్ కు వెళ్లకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల వల్ల అనుష్క ఆన్ లైన్ ప్రమోషన్స్ మినహా టీవీ చానెళ్లలో పాల్గొననని.బిగ్ బాస్ షోలో కూడా పాల్గొననని నిశ్శబ్దం యూనిట్ కు ముందుగానే చెప్పింది.

మీడియాతో కూడా అనుష్క బయట నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టీవీ కార్యక్రమాలకు హాజరు కాలేనని వెల్లడించింది.

పలు టీవీ ఛానెళ్లు అనుష్కను ఇంటర్వ్యూలకు పిలుస్తున్నా అనుష్క మాత్రం వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు.

ఈ కారణం వల్లే అనుష్క బిగ్ బాస్ హౌస్ కు కూడా వెళ్లలేదు.వైరస్ ఎక్కడినుంచైనా సోకే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా అనుష్క ఈ నిర్ణయం తీసుకుంది.

#NishabdamMovie #Nishshbdam #Anushka Shetty #Bigg Boss 4 #Anushka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reasons Behind Anushka Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..