మోడీ మీద మూకుమ్మడి దాడిలో ఫలితం ఎవరికి అనుకూలం  

మోడీని అన్ని పార్టీలు లక్ష్యం చేసుకోవడం వెనుక ఆసక్తికర నిజాలు.

Reasons Behind All Parties Targeting On Modi-congress,reasons Behind All Parties,targeting On Modi,tdp

దేశ వ్యాప్తంగా ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమై మోడీకి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని కూడా మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే విపక్షాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతని దీటుగా ఎదుర్కొంటూ ప్రధాని మోడీ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు..

మోడీ మీద మూకుమ్మడి దాడిలో ఫలితం ఎవరికి అనుకూలం -Reasons Behind All Parties Targeting On Modi

అయితే దేశంలో విపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురవుతున్న ప్రజల మద్దతు మోడీకి ఉందని మీడియా సర్వేలలో చెబుతుంది. అయితే బీజేపీ పార్టీ ఈ ఎన్నికలలో దారుణ పరాభవం చూడటం గారంటీ అంటూ విపక్షాలు అన్ని గట్టిగా చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మోడీ మీద ఇలా మూకుమ్మడి దాడి చేయడానికి వెనుక చాలా పెద్ద ప్రణాళిక ఉందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

దేశం ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలకి ఒక్కోసారి ప్రాంతీయ పార్టీలు తమ స్వలాభం కోసం అడ్డుపడుతున్నాయి. ఈ నేపధ్యంలో నోట్ల రద్దు కారణంగా చాలా ప్రాంతీయ పార్టీలు తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నాయి. ఇక అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారి జాతకాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.

మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే ఈ సారి తమ బండారం పూర్తిగా బయట పెడతాడనే భయంతో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మోడీని గద్దె దించి మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కడితే తమ ఆటలు హ్యాపీగా సాగించుకోవచ్చని భావిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.