ఆ రీజన్ వల్లే అదిరింది షోకు నో చెప్పా.. అదిరే అభి కీలక వ్యాఖ్యలు..?

జబర్దస్త్ షోలో కమెడియన్ గా గత కొన్ని సంవత్సరాలుగా స్కిట్లు చేస్తూ అదిరే అభి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అదిరే అభి టీమ్ లో ఉండేవాళ్లు సైతం అదిరే అభి సరైన సమయానికి పేమెంట్స్ ఇస్తారని ఇవ్వల్సిన మొత్తం కంటే ఎక్కువమొత్తం పేమెంట్స్ ఇస్తారని అదిరే అభి చెప్పారు.

 Reasons Behind Adire Abhi Rejected Adirindi Show Offer-TeluguStop.com

కారు యాక్సిడెంట్ వార్తల గురించి స్పందిస్తూ తాను ఇంట్లో వాకింగ్ చేస్తుంటే మీడియా మిత్రుల నుంచి ఫోన్ వచ్చిందని కారు యాక్సిడెంట్ అయిందా అని వాళ్లు అడగడంతో తనకేమీ అర్థం కాలేదని అభి అన్నారు.

తన కారు యాక్సిడెంట్ కాలేదని వాళ్లకు చెప్పానని అయితే ఆ తర్వాత మళ్లీ తనకు ఫోన్లు వచ్చాయని అదిరే అభి పేర్కొన్నారు.

 Reasons Behind Adire Abhi Rejected Adirindi Show Offer-ఆ రీజన్ వల్లే అదిరింది షోకు నో చెప్పా.. అదిరే అభి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత మీడియా ఫ్రెండ్స్ కు వాయిస్ నోట్ పంపించానని అదిరే అభి వెల్లడించారు.మంచి రీజన్స్ వల్ల న్యూస్ లో వస్తే బాగుంటుందని తాను ఆర్గాన్ డొనేషన్ చేసినా ఆ న్యూస్ గురించి ఎవరూ రాయలేదని అదిరే అభి పేర్కొన్నారు.

ఏదైనా నెగిటివ్ న్యూస్ వేగంగా స్ప్రెడ్ అవుతాయని అదిరే అభి వెల్లడించారు.

అదిరింది షోలో ఛాన్స్ రాగా తన టార్గెట్ సినిమాలు అని నాగబాబుకు చెప్పి ఆ షోకు నో చెప్పారని అదిరే అభి అన్నారు.తన సినిమాలకు సహాయం చేస్తానని నాగబాబు చెప్పడంతో పాటు నాగబాబు తన సినిమా గురించి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసి తనకు మేలు చేశారని అదిరే అభి వెల్లడించారు.మల్లెమాల తమపై ఒత్తిడి పెంచింది అనడంలో నిజం లేదని అదిరే అభి పేర్కొన్నారు.

అదిరింది షో ప్రారంభమయ్యే సమయానికి జబర్దస్త్ ప్రారంభమై 7 సంవత్సరాలు కావడంతో మరింత బాగా స్కిట్లు చేయాలని చెప్పారని మరికొన్ని సంవత్సరాలు జబర్దస్త్ షో ప్రసారమైతే తమ కెరీర్ కు ఉపయోగపడుతుందని అదిరే అభి చెప్పుకొచ్చారు.

#Jabardasth #Adire Abhi #Offers #Car #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు