బిగ్ బాస్ చేసిన తప్పు వల్లే అభిజిత్ విన్నర్ అయ్యారా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది.ప్రేక్షకులు ఊహించిన విధంగానే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు.

 Reasons Behind Abhijith Won Bigg Boss Season 4 Title Trophy, 25 Lakhs Prize Mone-TeluguStop.com

అయితే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ కావడంలో ఆశ్చర్యం లేకపోయినా బిగ్ బాస్ చేసిన తప్పు వల్లే అతను విన్నర్ అయ్యాడని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 గురించి మాట్లాడాల్సి వస్తే ఈ సీజన్ లో కంటెస్టెంట్ల ఎంపికలోనే ఎన్నో పొరపాట్లు ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా వీళ్లలో ఐదారుగురు మినహా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న కంటెస్టెంట్లు లేరు.విచిత్రం ఏమిటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న లాస్య, గంగవ్వ, నోయల్, కుమార్ సాయి, అవినాష్ వేర్వేరు కారణాల వల్ల టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలోకి చేరకుండానే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

దీంతో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాంఢ్ ఫినాలేకి రెండు వారాల ముందే అభిజిత్ విన్నర్ అని కన్ఫామ్ అయిపోయింది.

Telugu Lakhs Prize, Abhijeeth, Bigg Boss-Latest News - Telugu

బిగ్ బాస్ సీజన్ 2లో గీతామాధురి, బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖి లాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కు గట్టి పోటీని ఇచ్చారు.కానీ ఈ సీజన్ లో అభిజిత్ కు పోటీ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోవడమే బిగ్ బాస్ చేసిన తప్పు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఫ్రైజ్ మనీలో కోత విధించడంపై కూడా ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఫ్రైజ్ మనీలో కోత వల్ల వల్ల బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సోహెల్ కు విన్నర్ అయిన అభిజిత్ కు చెరో 25 లక్షల రూపాయలు వచ్చాయి.

మరోవైపు అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే పీఆర్ టీంను ఏర్పాటు చేసుకున్నాడని ఆ టీం కూడా పరోక్షంగా అభిజిత్ విన్నర్ కావడానికి కారణమైందని ఆరోపణలు ఉన్నాయి.

ఏది ఏమైనా సీజన్ 4 లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్లు లేకపోవడం వల్ల సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్ ఎవరనే ఉత్కంఠను మాత్రం ప్రేక్షకులకు కలిగించలేక పోయిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube