Ajith Thunivu: అజిత్ 'తునివు' తెలుగు బిజినెస్ వివరాలివే.. డీసెంట్ గా కానిచ్చాడుగా!

కోలీవుడ్ హీరోలు కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఎందుకంటే చాలా మంది హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు.

 Reasonable Target For Ajith Thunivu In Telugu Details, Ajith Kumar, Thunivu Movi-TeluguStop.com

ప్రస్తుతం మన హీరోలు అన్ని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.కోలీవుడ్ హీరోలు మాత్రం కేవలం దక్షిణాది భాషల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

ఇక దక్షిణాదిలో అతి పెద్ద సీజన్ ఏది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.ఈ పండుగకు మన స్టార్ హీరోలు తమ సినిమాలను బరిలోకి దింపేందుకు రెడీ అవుతారు.

అలాగే 2023 సంక్రాంతికి కోలీవుడ్ నుండి కూడా రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన వారసుడు కాగా.మరొకటి అజిత్ కుమార్ నటించిన తునివు. కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా అవతరించిన అజిత్ సినిమా వస్తుంది అంటే అక్కడ మాములు అంచనాలు ఉండవు.

మరి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ సినిమా తునివు మీద కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా రాలేదు.

Telugu Ajith Kumar, Ajith Thunivu, Ajiththunivu, Kollywood, Manju Warrier, Thuni

అయినప్పటికీ తెలుగులో కూడా ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల వరకు జరిగినట్టు టాక్.

ఈయన వలిమై సినిమాతో తెలుగులో కూడా బాగానే ఆకట్టు కున్నాడు.మరి ఇప్పుడు రిలీజ్ కాబోతున్న తునివు ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.బోణీ కపూర్ నిర్మించారు.

అలాగే మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది.చూడాలి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube