కొందరు మహిళలకి మీసం ఎందుకు వస్తుంది?  

Reason Why Women Grow Facial Hair-

ముఖంపై వెంట్రుకలు పెరగడం అనేది పురుష లక్షణం.మీసం, గడ్డం అనేవి మగవారికి పురుష హార్మోన్ల వలన పెరుగుతాయి.అది సహజం..

Reason Why Women Grow Facial Hair---

కాని కొంతమంది ఆడవారికి కూడా పెదాల మీద మీసం రావడం, కాస్తంత గడ్డం రావడం చూస్తుంటాం.అబ్బాయిలు క్లీన్ షేవ్ తో ఉన్నా వచ్చే ఇబ్బంది ఏమి లేదు కాని, అమ్మాయికి మీసం, గడ్డం వస్తే ఆ పరిస్థితిని తట్టుకోలేకపోతారు అమ్మాయిలు.షేవ్ చేస్తే తప్ప, నలుగురిని కలవలేరు.

అబ్బాయిల్లా కాకుండా, ఇలాంటి అమ్మాయిలు రోజూ ఖచ్చితంగా షేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి.ఇలా ఎందుకు జరుగుతుంది?అండ్రోజన్స్ అనేవి మగ హార్మోన్లు.దీనిలోనే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉంటుంది.

మగవారిలో మీసం, గడ్డం పెరగడానికి ఇవే కారణం.ఈ హార్మోన్లు ఆడవారిలో కూడా ఉంటాయి.కాని మగవారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉండటంతో అమ్మాయిల ముఖంపై వెంట్రుకలు రావు.

కాని కొంతమంది అమ్మాయిల శరీరాల్లో అండ్రోజన్స్ అవసరానికి మించి ఉంటాయి.ఆ కారణంతోనే మీసం, గడ్డం వస్తాయి.ఇది పూర్తిగా వింత సమస్య కాదు.

జీన్స్ తో కాని, జనానంగాల్లో, అండాశయంలో తిత్తుల వలన కాని, అధిక బరువు వలన కాని , అండ్రోజన్స్ ఎక్కువ విడుదల అవుతాయి అమ్మాయి శరీరంలో.ఈ సమస్యను హిర్సుటిజమ్ అని అంటారు.ఈ సమస్యకు సంబంధించిన చికిత్సలు మార్కెట్లో చాలానే ఉన్నా, ప్రతి చికిత్స వెనుక ఏదో ఒక సమస్య ఉంటుంది.

కాని ఇది సైన్స్ యుగం.ఇలాంటి సమస్యలకు మూఢనమ్మకాలు అంటగట్టినా నమ్మకూడదు అమ్మాయిలు.కొంతమంది మగవారికి మీసం, గడ్డం రాదు.

ప్రతి శరీరానికి ఏదో ఒక సమస్య ఉంటుంది.అది అర్థం చేసుకోని ఆత్మవిశ్వాసంతో ఉండాలి.