కొంతమంది మగవారు గడ్డం ఎందుకు పెంచలేకపోతారు  

Reason Why Some Men Can’t Grow Beard-

ఒకప్పుడు మీసం మాత్రమే ఉండి , గడ్డం లేకపోవడం ఫ్యాషన్.అప్పుడు ఫ్యాషన్ సెన్స్ మరీ అంతగా లేకపోవడంతో మీసం ఉంచుతున్నారా, తీసేస్తున్నారా అనేది ఎవరు పట్టించుకోలేదు.

సినిమాల పిచ్చి ఎక్కువయ్యాక, 1990ల్లో , దక్షిణాది సినిమాల్లో మీసం ఉంచడం, బాలివుడ్ లో పూర్తిగా క్లీన్ షేవ్ తో కనిపించడం మొదలుపెట్టారు హీరోలు.అప్పటికి కూడా మగవారి ఫ్యాషన్ ని పెద్దగా పట్టించుకోలేదు అమ్మాయిలు.

-

2000వ సంవత్సరం దాటిన తరువాత కుర్రకారు అంతా క్లీన్ షేవ్ తోనే కనిపించడం మొదలుపెట్టారు.ఎందుకంటే బాలివుడ్ హీరోలు ఎవరు మీసం , గడ్డం తో కనిపించేవారు కాదు.

అమ్మాయిలకి కూడా మీసం నచ్చేది కాదు.ఇప్పుడు ట్రెండ్ మారింది.భాషతో సంబంధం లేకుండా హీరోలంతా మీసాలు, గడ్డలు విపరీతంగా పెంచేస్తున్నారు.ఇప్పుడు అమ్మాయిలు కూడా మీసం, గడ్డం ఉంచితేనే ఇష్టపడుతున్నారు.

అబ్బాయిల ఫ్యాషన్ ని విపరీతంగా గమనిస్తున్నారు కూడా అమ్మాయిలు.

గడ్డం పెంచలేని అబ్బాయిలకు ఇప్పుడు సమస్య వచ్చిపడింది.నడుస్తున్న ట్రెండ్ కి తగ్గట్టుగా చాలామంది గడ్డం పెంచలేకపోతున్నారు.ఇలా ఎందుకు జరుగుతోంది? కొందరికి విపరీతంగా గడ్డం పెరిగి, మరికొందరికి ఉండి ఉండనట్టుగా, మరికొంతమందికి పూర్తిగా గడ్డం రాకపోవడానికి కారణం ఏమిటి ?

ఇది పూర్తిగా జీన్స్ తో ముడిపడిన విషయం.దానితో పాటు టెస్టోస్టీరోన్ హార్మోన్ కి అబ్బాయి శరీరం స్పందించే విధానాన్ని బట్టి కూడా గడ్డం, మీసం పెరగడం, పెరగకపోవడం జరుగుతుంది.దీన్ని చిన్నతనంగా భావించాల్సిన పనిలేదు.గడ్డం పెంచే మగవారిలో ఉండే, తెలివితేటలు,టెస్టోస్టీరోన్ లెవెల్స్ అన్ని గడ్డం పెంచలేని మగవారిలో కూడా ఉంటాయి.ఆడవారిలో కొందరికి వక్షోజాలు చిన్నగా ఉండి , కొందరికి పెద్దగా ఉండటం ఎలాగో, ఇది అంతే.

ఇక, క్లీన్ షేవ్ మగవారికి ఒక లాభం కూడా ఉంది.గడ్డం పెంచలేనివారికి భవిష్యత్తులో బట్టతల వచ్చే ప్రమాదం చాలా తక్కువట.

తాజా వార్తలు