షకీలా 250వ చిత్రం 'శీలవతి' డైరెక్ట్‌ యూట్యూబ్‌లో వదిలారు... కారణం ఇదే

సౌత్‌ ఇండియా యూత్‌ ఆడియన్స్‌ మొత్తాన్ని కూడా 1990లలో ఒక ఊపు ఊపిన సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ షకీలా మెల్ల మెల్లగా కనుమరుగవుతూ వచ్చింది.షకీలా సినిమాలు చూసే వారే కరువయ్యారు.249 సినిమాల్లో నటించిన షకీలా తన 250వ సినిమాగా ‘శీలవతి’ చేసింది.చాలా నెలల క్రితమే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

 Reason Why Shakila Seelavathi Movie Released Directly In To Youtube-TeluguStop.com

అయితే సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క థియేటర్‌ అంటే ఒక్క థియేటర్‌లో కూడా విడుదల చేసేందుకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఆసక్తి చూపించలేదు.నిర్మాతలు సినిమాను చూపించిన తర్వాత కూడా ఆసక్తి చూపించలేదు.

ఈమద్య కాలంలో సినిమాలు సెన్సార్‌ బోర్డు గేటు దాటని నేపథ్యంలో డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో వస్తున్నాయి.ఇప్పుడు శీలవతి కూడా ఆన్‌లైన్‌లో వచ్చేసింది.షకీలా 250వ సినిమా అంటూ తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారని నమ్మి సినిమాను తీసిన చిత్ర నిర్మాతకు చేదు అనుభవం మిగిలింది.సినిమాను థియేటర్‌లో విడుదల చేయలేక పోయిన నిర్మాత డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో విడుదల చేశాడు.

ప్రముఖ తెలుగు యూట్యూబ్‌ ఛానెల్‌ తెలుగు వన్‌ ద్వారా సినిమాను విడుదల చేయడం జరిగింది.సినిమా యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 50 వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

షకీలా సినిమాలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని, తప్పకుండా ఈ సినిమా మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుందని అంటున్నారు.సినిమా చూసిన వారు మాత్రం నెగటివ్‌గా స్పందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.అప్పట్లో షకీలా సినిమాలు ఉన్న స్థాయిలో ఈ సినిమా లేదని, పరమ చెత్త మూవీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.పైగా ఈ సినిమా షార్ట్‌ ఫిల్మ్‌ల క్వాలిటీ కూడా లేదని, ఏమాత్రం క్వాలిటీ లేకపోవడం వల్లే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదేమో అనే టాక్‌ వినిపిస్తుంది.

మొత్తానికి షకీలా 250వ సినిమా మరీ ఇంత పేలవంగా ఉంటుందనుకోలేదు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube