ఆ కారణంగా ప్రియురాలు వివాహానికి దూరంగా ఉండనున్న స్టార్ హీరో?

కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె టాలీవుడ్,బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.

 Reason Why Salman Wont Attend Vicky Kaushal Katrina Kaif Wedding, Salman Khan, K-TeluguStop.com

తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది.ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటించి సార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రేమించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ బంధానికి బ్రేక్ పడింది.

అనంతరం కత్రినా కైఫ్,విక్కీ కౌశల్ తో ప్రేమలో పడింది.వీరి ప్రేమ కాస్త పెళ్లి పీటల దాకా వెళ్ళింది.వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుంది.ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి రాజస్థాన్ వేదిక కానుంది.అయితే ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందాయి.కత్రినా ఫ్రెండ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లోనే వీరి రోకా ఫంక్షన్ జరిగింది.

కబీర్ ఖాన్ వీరి పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని అర్థమవుతోంది.

Telugu Katrina Kaif, Marrige, Salman Khan, Vicky Kaushal-Movie

అయితే ట్యూబ్ లైట్ ఫిల్మ్ సమయంలో కబీర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.దీంతో సల్మాన్ ఖాన్ ఈ పెళ్ళికి అటెండ్ అవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.మాజీ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి అదే సాకుతో ఈ కార్యక్రమానికి రాకుండా స్కిప్ చేస్తాడన్న విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక అదేసమయంలో టైగర్ 3, పఠాన్ షూటింగ్ కు హాజరు కావాల్సి ఉందని సమాచారం.మరి ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ హాజరు అవుతారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube