లగడపాటి భార్య ఈ సంచలన ప్రచారం వెనుక రాజకీయం ఏంటి..?     2018-12-06   16:28:09  IST  Sai Mallula

గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన లగడపాటి రాజగోపాల్ తన సర్వేలతో తెలంగాణ అంత మారుమోగిపోయాడు. ఆయన ప్రకటించిన సర్వేలు తెలంగాణాలో హల్చల్ చేశాయి. కొన్ని పార్టీలకు అవి అనుకూలంగా ఉండి సంతోషాన్ని కలిగించాయి. కానీ కొన్ని పార్టీలకు లగడపాటి సర్వేలు ఆగ్రహం తెప్పించాయి. అయితే… ఈ విషయంలో మొత్తం టీఆర్ఎస్ దృష్టిలో లగడపాటి విలన్ అయ్యాడు. ఒకరిని ఒకరు ఈ విషయం లో విమర్శించుకున్నారు. లగడపాటి సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉండేలా చేయించారని.ఆయన బాబు ఏజెంట్ అంటూ… కూడా విమర్శించారు. అయితే …చివరికి కేటీఆర్ – లగడపాటి మధ్య వాట్సాప్ చాటింగ్ కూడా బయటపెట్టాడు లగడపాటి.
లగడపాటి వర్సెస్ టీఆర్ఎస్ అనే హోరాహోరీ సమయంలో లగడపాటి భార్య టీఆర్ఎస్ గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు.

Reason Why Lagadapati Rajagopal Wife Campaigning For TRS-Lagadapati Lagadapati Trs Padma

Reason Why Lagadapati Rajagopal Wife Campaigning For TRS

ఈ విషయం అందరిని షాక్ కి గురిచేసింది. ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌ డివిజన్‌లో ప్రచారం చేశారు. ‘దానం నాగేందర్‌ అన్నను గెలిపించాలి’అని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదని.. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు. దీనిపై అంతా అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఇక లగడపాటి విషయంలో
హరీశ్ రావు అయితే, లగడపాటిపై తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చూసిన దొంగ, బట్టేబాజ్‌ లగడపాటి రాజ్‌గోపాల్‌ అని విమర్శలు గుప్పించారు.

Reason Why Lagadapati Rajagopal Wife Campaigning For TRS-Lagadapati Lagadapati Trs Padma

బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో లగడపాటిపై హరీశ్ విరుచుకుపడ్డారు. తెలంగాణను చంద్రబాబు తిరిగి ఆంధ్రాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని.. చంద్రబాబు ఏజెంటుగా మారిన లగడపాటి అబద్దపు సర్వేలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ గెలవదని చెప్పడం పెద్ద జోక్‌ అన్నారు హరీశ్. లగడపాటి సర్వే తో తెలంగాణ అంతా ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, ప్రశాంతంగా అదే పార్టీకి ఓటు వెయ్యాలంటూ లగడపాటి భార్య పద్మ ప్రచారం చేయడం మాత్రం అనేక సందేహాలు కలిగిస్తోంది. అయితే.. ఈ విషయం పై లగడపాటి మాత్రం ఇంకా నోరు మెదపడంలేదు.