పబ్జీ గేమ్‌కు అంత క్రేజ్ ఎందుకో తెలుసా?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పబ్జీ గేమ్ బ్యాన్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.కొందరు కేంద్రం పబ్జీ గేమ్ ను బ్యాన్ చేయడాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం పబ్జీని బ్యాన్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

 Reason Behind Pubg Game Craze, Pubg Game Special Features,pubg Game, App Banned,-TeluguStop.com

దేశంలో దాదాపు 50 మిలియన్ల మంది పబ్జీ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోగా 35 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.యువత, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ గేమ్ పట్ల ఆకర్షితులయ్యారు.

ఈ గేమ్ దక్షిణ కొరియాకు చెందిన గేమ్ అయినప్పటికీ చైనాకు చెందిన సంస్థ పబ్జీ యాప్, పబ్జీ లైట్ యాప్ ను డెవలప్ చేయడంతో కేంద్రం నిషేధం విధించింది.2000 సంవత్సరంలో పబ్జీ గేమ్ కార్పొరేషన్ సంస్థ జపాన్ లో హిట్ మూవీ అనిపించుకున్న రాయల్ ను స్పూర్తిగా తీసుకుని పబ్జీ గేమ్ ను రూపొందించింది.అనంతరం ఈ గేమ్ లో చిన్న చిన్న మార్పులు చేస్తూ డెవలప్ చేసుకుంటూ వచ్చింది.
ఈ గేమ్ లో వంద మంది ఉన్న ప్రాంతంలో విజేతగా నిలిచే ఒక్కడికి చికెన్ డిన్నర్ లభిస్తుంది.పిల్లలు, యువతను ఆకర్షించే ఛేజింగ్ లు, ఫైరింగ్ లు ఉండటం వల్ల ఈ గేమ్ ను ఎక్కువ మంది ఇష్టపడతారు.2018 ఫిబ్రవరి నెలలో పబ్జీ మొబైల్ వెర్షన్ భారత్ లో లాంఛ్ అయింది.2019 ఆగష్టులో పబ్జీ లైట్ అందుబాటులోకి వచ్చింది.పిల్లలు, యువతను ఆకర్షించడం వల్ల పబ్జీ యాప్ కు ఇతర యాప్ లతో పోలిస్తే ఎనలేని క్రేజ్ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube