యూఎస్‌లో ‘2.ఓ’ ఫ్లాప్‌కు ఇదే కారణం

భారీ అంచనాల నడుమ రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2.ఓ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కించుకుంటుందని, బాహుబలి రికార్డులు కనిపించకుండా చేస్తుందని తమిళ తంబీలు చాలా ఆశలు పెట్టుకున్నారు.

 Reason Is 2 O Movie Flop In Usa-TeluguStop.com

కాని ఫలితం తారు మారు అయ్యింది.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ అయితే వచ్చింది కాని, ఆశించిన స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టడంలో విఫలం అవుతోంది.

మొదటి రోజు కాస్త అటు ఇటుగా 100 కోట్లను రాబట్టింది.అయితే ఆ మొత్తం సరిపోదనేది ట్రేడ్‌ వర్గాల వారి వాదన.

ఇక తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, బాలీవుడ్‌లో ఒక మోస్తరుగా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంది.అమెరికాలో మూడు భాషల్లో 2.ఓ చిత్రం విడుదల అయ్యింది.మూడు భాషలు కలిపి 7.2 మిలియన్‌ల బిజినెస్‌ చేసింది.బ్రేక్‌ ఈవెన్‌ రావాలి అంటే 7.5 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు 3.2 మిలియన్‌ డాలర్లను మాత్రమే వసూళ్లు చేయగలిగింది.మొత్తంగా అయిదు మిలియన్‌ డాలర్లను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

అంటే దాదాపుగా రెండున్నర మిలియన్‌ల నష్టం డిస్ట్రిబ్యూటర్లకు తప్పేలా లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఓవర్సీస్‌లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలను ఆధరిస్తూ ఉంటారు.ఇలాంటి యాక్షన్‌ సినిమాలు కావాలంటే వారికి హాలీవుడ్‌ సినిమాలు ఉండనే ఉన్నాయి.ఫ్యామిలీ సినిమాలైతేనే అక్కడ ఎక్కువగా వసూళ్లు సాధిస్తాయని ఇప్పటికే నిరూపితం అయ్యింది.2.ఓ వంటి టెక్నికల్‌, విజువల్‌ వండర్‌ను వారు ఆధరించాలనుకోవడం లేదని, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌, కామెడీ ఉన్న సినిమాలైతే చూస్తామని అక్కడ ప్రేక్షకులు ఈ ఫలితం ద్వారా చెప్పకనే చెప్పారు.అక్కడి వారి పల్స్‌ తెలుసుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంకు కొనగోలు చేసి నిండా మునిగే పరిస్థితి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube