టీఆర్ఎస్ గెలవడానికి కారణం అదే .. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారం సాధించింది.అంతే కాదు.

 Reason For Trs Party Win In Telangana-TeluguStop.com

ఎవరూ ఊహించని స్థాయిలో అసెంబ్లీ సీట్లు కూడా సాధించుకుంది.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపుపై మాకు సందేహాలు ఉన్నాయి అంటూ….

కాంగ్రెస్ నేతలు కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేయడం….హడావుడి చేయడం…అన్నీ చక చక జరిగిపోయాయి.

ఆ తరువాత అంతా కామ్ అయిపోయారు.కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ టీఆర్ఎస్ గెలుపుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు.తాజాగా… కొండా సురేఖ ఆయన భర్త మురళీతో కలిసి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో సమావేశమయ్యారు.అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉన్నా లేకున్నా తాము జనంలో ఉంటామని.జనం తమ వెంట ఉన్నారన్నారు.అధికారులు కూడా మమ్మల్ని గౌరవిస్తారని.తాము కోరిన పనులు చేసిపెడతారని సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు.ఎన్నికలు ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే….ఆయనకు ….

టీఆర్ఎస్ పార్టీ నుంచి….ఎంఎల్సీ పదవికి సంబంధించి… షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన వారి అనర్హత ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోరు గానీ టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళితే మాత్రం వెంటనే నోటీసులు ఇవ్వడమేంటీ అంటూ ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎమ్మెల్సీ పదవికి ముందే రాజీనామా చేయాలని మురళీ ముందే నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు.

అసలు తెలంగాణాలో టీఆర్ఎస్ గెలవడం వెనుక ….ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ హస్తం ఉందని….ఆ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకుని ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా ప్లాన్ చేశారని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీని కారణంగానే….తెలంగాణాలో ఓడిపోతుంది అని అంతా భావించిన టీఆర్ఎస్ గెలిచిందని….కానీ… 100 లోపు వస్తాయని చెప్పడమే కాకుండా… ఎవరెవరు ఓడిపోతారో అంత ఖచ్చితంగా చెప్పగలిగారని ఆమె అన్నారు.వీటి కారణంగానే టీఆర్ఎస్ గెలుపుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube