రామ్‌ చరణ్‌ ఓటు ఎందుకు వేయలేక పోయాడో తెలుసా?

నిన్న తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 Reason For Ram Charan Not Used His Vote-TeluguStop.com

మహేష్‌బాబు, చిరంజీవి, ఎన్టీఆర్‌, రాజమౌళితో పాటు ఇంకా పలువురు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే వీరిలో రామ్‌ చరణ్‌ లేకపోవడం కాస్త ఆశ్చర్యంగా చర్చ జరిగింది.

రామ్‌ చరణ్‌ ఎందుకు ఓటు వేయలేదు అంటూ చర్చ మొదలైంది.ఎప్పుడైనా చిరంజీవితో కలిసి ఎన్నికల్లో పాల్గొనే చరణ్‌ ఈసారి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నాడు.

ఓటు వేయకుండా చరణ్‌ ఎటు పోయాడో అంటూ అంతా చర్చించుకున్నారు.ఆ సమయంలోనే చరణ్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా తాను ఓటు వేయలేక పోతున్నందుకు నిరుత్సాహంగా ఉంది, ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేక పోవడం వల్లే ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను అంటూ చరణ్‌ పోస్ట్‌ చేశాడు.చరణ్‌ మొన్నటి వరకు ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు కదా, మరి ఎక్కడకు వెళ్లినట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.అయితే చరణ్‌ శబరిమల వెళ్లినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రామ్‌ చరణ్‌ అయ్యప్ప దీక్ష తీసుకున్న విషయం తెల్సిందే.అయ్యప ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్లినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం చరణ్‌ అక్కడకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.అయితే ఓటు వేసిన తర్వాత చరణ్‌ వెళ్లి ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి చరణ్‌ ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube