కారెక్కబోతున్న నామా ? కారణం ఇదే

గత కొంతకాలంగా ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నామా నాగేశ్వరావు తెలుగుదేశం పార్టీ లో ఎంపీ గా పనిచేయడంతో పాటు చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ హవా తెలంగాణాలో పెరగడం అటు కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అంత ప్రభావం భువోయించేలేకపోవడం తదితర కారణాల వల్ల నామా కారెక్కేందుకు చూస్తున్నారు.

 Reason For Nama Nageswara Rao Joining Trs-TeluguStop.com

ఆయన రాకను టీఆర్ఎస్ కూడా స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది.ఆయనకు ఖమ్మం ఎంపీ సీటు ఖరారు చేసినట్టు సమాచారం.

కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు.

ఈ మేరకు టీడీపీకి రాజీనామా చేశారు.

త్వరలోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ నేపథ్యంలో సోమవారం నామా, కేసీఆర్‌ను కలవడంతో భావిస్తున్నట్టుగా అనుమానాలు మరింతపెరిగాయి.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖమ్మం అభ్యర్థిగా నామా పేరును జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.అయితే అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే నామా పేరును పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

గత శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.అయితే ఆ ఎన్నికల్లో ఆయన పరాజయంపాలయ్యారు.

వాస్తవానికి ఖమ్మం లోకసభ స్థానానికి టీడీపీ కాంగ్రెస్ పార్ట్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పోటీ చేస్తారని అంతా భావించారు.అయితే, ఖమ్మం టికెట్ తనకు కావాలంటూ కాంగ్రెసు నేత రేణుకా చౌదరి గట్టిగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరావు గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధం అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇక నామా టీఆర్ఎస్ లోకి వచ్చే విషయంలో ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకూ కూడా సమాచారం అందించారట.ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube