వైసీపీ బీజేపీ పొత్తుపై ఆ సర్వే సంస్థ తేల్చిందిదే ?

కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏపీ, అధికార పార్టీ వైసీపీ మధ్య ఇప్పుడు స్నేహం చిగురిస్తుంది.రెండు ప్రభుత్వాలకు ఒకరితో ఒకరు చెలిమి చేయడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.

 Ycp-bjp Alliance, Narendra Modi, Ys Jagan, Jagan Met Modi To Discuss Ap Politics-TeluguStop.com

పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి నిధుల కొరత, తన రాజకీయ నిర్ణయాలకు కేంద్రం మద్దతు, ఇలా అనేక అంశాలపై జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు, ఆ పార్టీకి అన్నిరకాలుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా, ఇప్పటికే ఆ పనిలో నిమగ్నం అయిపోయరు.ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపి కి జగన్ తో పొత్తు ఇప్పుడు అత్యవసరంగా మారింది.

ఎన్డీఏ నుంచి తమ మిత్రపక్షాలు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉండడంతో, జగన్ అవసరం వారికి చాలా ఏర్పడింది.దీంతో బిజెపి పెద్దలు జగన్ తో పొత్తుకు అంగీకారం తెలుపుతూ రాయబారం సైతం పంపించారట.

ఇదిలా ఉంటే నేడు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉండడం, ఈ మేరకు ఆయన అపాయింట్మెంట్ దక్కడంతో అక్కడ జరగబోయే భేటీలో ఒకరికొకరు మద్దతు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఏం జరగబోతుంది అనే అంశాలపై ఓ సర్వే సంస్థ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.వీడీపీ అసోసియేట్స్ అనే సర్వే సంస్థ దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, రాజకీయ విశ్లేషణ, పోలింగ్ ఏజెన్సీ, వంటి అంశాల్లో దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవహారాలపై సర్వేలను నిర్వహిస్తూ ఉంటుంది.

ఈ మేరకు బిజెపి, వైసీపీల పొత్తుల వ్యవహారంపైన ఈ సర్వే సంస్థ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వైసీపీని ఎన్డీయేలో చేరాలంటూ ఆహ్వానించిన మాట నిజమేనని, కాకపోతే ఈ అంశాన్ని జగన్ తోసిపుచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సంస్థ అంచనా వేస్తోంది.

Telugu Cbiinvestigatio, Lokesh, Narendra Modi, Ys Jagan-Telugu Political News

వైసీపీ లోని కీలక నాయకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే, తాము ఈ విషయం వెల్లడిస్తున్నాము అంటూ, ఆ సర్వే సంస్థ పేర్కొంది.అసలు వైసీపీ ఎన్డీయేలో చేరుతుందా లేదా అనే విషయం, ఏపీకి ప్రత్యేక హోదా అంశం నిర్ణయిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలుపుతూ, బహిరంగ ప్రకటన చేస్తే, జగన్ ఏ విధమైన కండిషన్ పెట్టకుండా ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేస్తోంది.

రాష్ట్రానికి ఫైనాన్స్ బెనిఫిట్ చేసుకోవాలని చూస్తున వైసీపీ ప్రభుత్వం బిజెపి తమకు అనుకూలంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతును ఇప్పటి నుంచే కూడగడుతున్నారు.

దీనిలో భాగంగానే జగన్ కు ప్రాధాన్యం పెంచినట్లుగా కనిపిస్తున్నారు.అయితే జగన్ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు, తాను ఏపీకి సంబంధించిన తీసుకున్న కీలక నిర్ణయాలలో చంద్రబాబు లోకేష్ పై సిబిఐ విచారణ, ఇలా అనేక అంశాల్లో కేంద్రం నుంచి పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాతనే పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube