ఎమ్మెల్యే సీటుపై టీఆర్ఎస్ ఎంపీల మోజు వెన‌క‌..!

దేశంలో అత్యున్న‌త స్థాయి చ‌ట్టస‌భ పార్ల‌మెంటు.దీనిలోకి అడుగు పెట్టాల‌ని ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు ఎన్నో క‌ల‌లు కంటుంటాడు.

 Reason Behind Trs Mps Interested In Mla Seat-TeluguStop.com

అంతేకాదు, పార్టీలో అధినేత‌పై ఒత్తిడి తెచ్చి మ‌రీ ఎంపీ సీటును పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు.కానీ, ఇప్ప‌డు టీఆర్ ఎస్‌లో ఎంపీలుగా ఉన్న కొంద‌రికి మాత్రం తాము ఎంపీలు ఎందుక‌య్యామా? అని తెగ ఫీలైపోతున్నార‌ట‌.దీనికి కార‌మేంటో తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.టీఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమ‌న్, న‌గేశ్, జితేంద‌ర్ రెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డి… తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచారు.

అంతేకాదు, కేసీఆర్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కూడా కొట్టేశారు.దీంతో కేసీఆర్ ముందు వెనుకా ఆలోచించ‌కుండా.వీళ్లంద‌రికీ ఎంపీ టికెట్టు ఇచ్చేశారు.

అయితే, ఇప్పుడు వీళ్లంతా తాము ఎంపీలు ఎందుక‌య్యామా? అని తెగ బాధ‌ప‌డుతున్నారు.దీనికి కార‌ణం ఏంటంటే.త్వ‌ర‌లోనే కేసీఆర్ మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ఊహాగానాలు వ‌స్తున్నాయి.దీంతో త‌మ‌కు మంత్రుల‌య్యే ఛాన్స్ పోతోంద‌ని వీరు బాధ‌ప‌డిపోతున్నారు.నిజానికి తామే ఎమ్మెల్యేలుగా ఉండి ఉంటే.

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో త‌మ‌కు కూడా బెర్తులు ఖ‌రార‌య్యేవ‌ని, కానీ, తాము ఎంపీలు కావ‌డంతో ఆ ఛాన్స్ మిస్స‌యిపోయామ‌ని వారు ఫీలైపోతున్నార‌ట‌.దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ జీవితంలో ఇక ఎంపీ ప‌ద‌వికి దూరంగా ఉండాల‌ని కూడా వీళ్లు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే బాల్క సుమ‌న్ సీఎం కేసీఆర్ తో మాట్లాడార‌ట‌.వ‌చ్చేసారి త‌న బ‌దులు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వివేక్ కు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కోరార‌ట‌.

త‌న‌కు మాత్రం అసెంబ్లీ టికెట్ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశార‌ని టాక్.అటు న‌గేశ్ కూడా త‌న‌కు ఎంపీ కంటే అసెంబ్లీ అయితేనే బెట‌ర‌ని చెప్పార‌ట‌.

ఇటు జితేంద‌ర్ రెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని కేసీఆర్ తో పంచుకున్నార‌ని తెలుస్తోంది.అయితే కేసీఆర్ వీరి మొర‌ను ఆల‌కిస్తారా.? అన్న‌ది స‌స్పెన్స్.కానీ, ఎంపీలుగా ఉన్న వారు ఇలా ప‌ద‌వుల కోసం పాకులాడ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి!! మ‌రి వీటిని వీళ్లు ప‌ట్టించుకుంటారా? లేదా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube