తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారా? మనం ఏ మాట్లాడినా తథాస్తు అంటారా?

మనం ఏదైనా చెడు మాటలు అంటే నేను చచ్చిపోతాను, నాకేమైనా అవుతుంది, కుటుంబ సభ్యులను కోపంలో తిడ్తూ.వారికేమైనా కావాలని కోరుకుంటే… వెంటనే పక్కన ఉన్న పెద్దలు అలా అనకూడదని అంటారు.

 Reason Behind The Thadasthu Devathalu, Thadasthu Devathalu, Devotioanl, Thada-TeluguStop.com

పైన తథాస్తు దేవతలు ఉంటారు మీరలా మాట్లాడితే… వారు తథాస్తు అంటే అది జరిగి తీరుతుందంటూ భయపెడ్తారు.అది నిజమేనా అని చాలా సార్లు అనుమానం వస్తుంది.

కొన్ని సార్లు అయితే నిజమైనా కాకపోయినా మన వారికి ఏదైనా అవుతుందంటే ఆ మాటలు మాట్లాడకుండా కూడా ఉంటుంటాం.కానీ నిజంగానే తథాస్తు దేవతలు ఉన్నారా.

మనం ఏదైనా మాట్లాడిన వెంటనే వారు తథాస్తు అంటారా లేదా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి తథాస్తు దేవతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు.

కానీ మన పూర్వీకులు మనం ఎప్పుడూ మంచి మాటలే పలకాలనీ, మంచి సంకల్పాలే చేయాలని వారు ఇలా చెప్పారు.ఏదైనా సరే దేవుడికి ముడి పెడితే మనం కచ్చితంగా వింటామని వారి నమ్మకం.

అందుకే వారు మన మంచి కోసం ఆలోచించి ఇలాంటివి చెబుతుండేవారు.</br

ప్రతికూలమైన మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా.మనకే నష్టం కల్గుతుంటుంది.అందుకే కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దని ఒక వేళ మాట్లాడితే నష్టం జరుగుతుందని మన పెద్దలు అలా చెప్పారు.

మన భావాలు ఎప్పుడూ పవిత్రంగా, సంస్కారవంతగా ఉండాలని గుర్తు చేయడానితి తథాస్తు దేవతల పేర్లు వాడుకున్నారు.అదే బాటలో మనం కూడా నడుస్తున్నాం.తథాస్తు దేవతలు ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడూ అమంగళం, అశుభకరమైన మాటలు మాట్లాకూడదు.అలాంటి మాటలెప్పుడూ మనకు హానినే కల్గజేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube